sleeping: ప్రకృతి ప్రకారం పగలు అనేది మేల్కోవడానికి, రాత్రి అనేది నిద్రించడానికి. కానీ ప్రస్తుతం సమాజంలో బిజీ బిజీ లైఫ్ తో గడిపేస్తున్న చాలా మంది దీనికి పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. రాత్రంతా పని చేసి పగలంతా పడుకుంటున్నారు. మరి ఇలా చేయడం ఆరోగ్యానికి సరైనదేనా..?
పగలు, రాత్రి నిద్ర మధ్య వ్యత్యాసం
నిపుణుల అభిప్రాయం ప్రకారం పపగలు నిద్రించే 7 గంటలకు, రాత్రి నిద్రించే 7 గంటలకు చాలా తేడా ఉందని చెబుతున్నారు. రాత్రి నిద్ర వల్ల పేగులలో ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి అవసరమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బ్యాక్టీరీయా 15 శాతం క్యాలరీలను కరిగిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది.
అంతే కాదు రాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు మెలోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది నాణ్యమైన నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తికి చీకటి చాలా అవసరం. అందుకే పగటి కంటే రాత్రి పూట నిద్ర శరీరానికి రిఫ్రెషింగ్ గా ఉంటుంది. పగటి సమయంలో చిన్న పవర్ న్యాప్ తీసుకోవచ్చు. తప్పని పని ఉంటే మాత్రమే రాత్రి సమయాల్లో మేల్కొని ఉండాలని.. లేదంటే త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది తప్పని పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు. కానీ రాత్రంతా మేల్కొని పని చేయడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నైట్ షిఫ్ట్ లు చేసే వారిలో మధుమేహం, గుండె జబ్బులు, వంటి జీవన శైలి వ్యాధులు ఊబకాయం అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఒక వ్యక్తి తప్పనిసరి 7-8 గంటల పాటు నిద్రపోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉదయం లేవగానే కాసేపు వ్యాయామం, వాకింగ్ చేయడం వల్ల శరీరం నుంచి హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి.
Also Read: Jani Mater: తన డ్యాన్స్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన జానీ మాస్టర్‌ను కిందపడేసిన స్టెప్ ఇదే..!