/rtv/media/media_files/2025/07/28/artificial-insemination-types-2025-07-28-15-05-35.jpg)
artificial insemination types
IVF: శారీరక సంబంధం లేకుండా కూడా బిడ్డను కనడం సాధ్యం! అనే అంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సహజంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారి కోసం వైద్యరంగంలో అత్యాధునిక పద్ధతులు వచ్చాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్ధతి IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)! అయితే కృత్రిమ గర్భధారణ కోసం IVF ఒక్కటే కాకుండా.. మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కృత్రిమ గర్భధారణ పద్ధతులు
IUI (ఇంట్రా-యుటెరైన్ ఇన్సెమినేషన్ )
IUI పద్దతిలో పురుషుడి నుంచి సేకరించిన శుక్రకణాలను(స్పెర్మ్ సెల్స్ ని) ప్రత్యేక పద్దతిలో శుభ్రం చేసి నేరుగా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. పురుషుడి స్పెర్మ్ కౌంట్ లేదా మొటిలిటీ తక్కువగా ఉన్నప్పుడు, స్త్రీ గర్భాశయ ముఖ ద్వారంలో సమస్యలు ఉన్నప్పుడు ఈ పద్దతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే IVF కంటే ఈ పద్ధతి చాలా సులభమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా.
సరోగసీ టెక్నీక్
స్త్రీ గర్భాశయంలో సమస్యలు ఉన్నప్పుడు, లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో స్త్రీ బిడ్డకు జన్మనివ్వలేనప్పుడు సరోగసీ పద్దతిని ఉపయోగిస్తారు. ఇందులో భార్య భర్తల నుంచి సేకరించిన ఓవరీస్, స్పెర్మ్ సెల్స్ ని ల్యాబ్ లో ఫలదీకరించి.. ఆ తర్వాత అభివృద్ధి చెందిన పిండాన్ని సరోగసీ మదర్ గర్భంలోకి ప్రవేశపెడతారు. సరోగసీ మదర్ అంటే తమ బిడ్డను మోయడానికి దంపతులు ఎంచుకునే మరొక స్త్రీ!
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/28/artificial-insemination-2025-07-28-16-12-22.jpg)
ICI (ఇంట్రా-సెర్వికల్ ఇన్సెమినేషన్ )
ఇది IUI కంటే కూడా చాలా సులభమైన పద్ధతి. ఈ పద్దతిలో పురుషుడి స్పెర్మ్ సెల్స్ ని స్త్రీ cervix లోపల లేదా చుట్టూ ప్రవేశపెడతారు. అయితే పురుషుడికి ejaculation (శుక్రకణ స్కలనం) సమస్యలు ఉన్నప్పుడు ఈ పద్దతిని ఉపయోగిస్తారు.
IVF: (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)
IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్దతిలో స్త్రీ అండాశయం నుంచి ఓవరీస్ సేకరించి.. వాటిని పురుషుడి స్పెర్మ్ తో ల్యాబ్ లో ఫలదీకరణ చేస్తారు. అలా శరీరం బయట ఫలదీకరణ చెందిన పిండాన్ని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపడతారు. సహజంగా గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతున్న దంపతులకు ఈ పద్దతిని సూచిస్తారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలు కోసం మీకు సమీపంలోని నిపుణులను సంప్రదించగలరు.
Also Read:Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!