Health Tips: పోషకాహార లోపం పిల్లల పెరుగుదలలో సమస్యలకు దారితీయవచ్చు. వీలైనంత వరకు పిల్లలను కూరగాయల షాపింగ్‌కు తీసుకెళ్లి కూరగాయలను పరిచయం చేయాలి. వారి చేతుల్లో బుట్టలు ఇచ్చి కూరగాయలను బుట్టలో నింపమని, కూరగాయల ప్రాముఖ్యత గురించి చెప్పాలి. వంట చేసేటప్పుడు పిల్లలను భాగస్వామ్యం చేయాలి. కూరగాయలు కోయడం, వంటలు వండటం చూపించాలని నిపుణులు అంటున్నారు. దీంతో వారు స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలు తినేందుకు పిల్లలు ఎక్కువ మొగ్గు చూపుతారని అంటున్నారు.
ఇలా వండిపెట్టండి:
- పిల్లలు మొదట్లో కూరగాయలు వద్దు అని చెప్పినా వారికి ఇష్టమైన ఆహారపదార్థాల్లో కూరగాయలు కలుపుకుంటే ఖచ్చితంగా వాటిని ఇష్టంగా తింటారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కూరగాయలు తినిపించడం అలవాటు చేసి క్రమంగా మిగతా వాటిని అలవాటు చేయాలి. బంగాళదుంపలు, బఠానీలు, క్యారెట్, బత్తాయి వంటి కూరగాయలను చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ముదురు రంగులు ఉండే కూరగాయలను ఇవ్వండి. భిన్నమైన ఆకారంలో, కంటికి ఆకర్షణీయంగా ఉండే కూరగాయలను పిల్లలు ఇష్టపడతారు. కూరగాయలను గుండె, జంతువులు, పక్షుల ఆకారంలో కోసి ఇవ్వడం వల్ల కూడా పిల్లలు ఆకర్షితులు అవుతారు.
ఇతర ఆహారాలతో ఇలా కలపండి:
- వోట్ మీల్, స్మూతీస్, మీట్‌బాల్‌లలో కూరగాయలను జోడించాలి. బీట్‌రూట్, క్యారెట్, బంగాళదుంపవంటి వివిధ కూరగాయలను వేసి వారికి ఇవ్వండి. కొన్ని ప్యాక్‌డ్ ఫుడ్స్‌లో కూరగాయలు ఉంటాయని చెబుతున్నారు. అయితే పిల్లలకు అలాంటి ఆహారపదార్థాలు ఇవ్వకుండా తాజా కూరగాయలను ఇవ్వాలని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కాఫీ తాగితే గుండె జబ్బులు రావా.. ఇందులో నిజమెంత..?