karthika masam 2024 కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపానికి ఇంత మహిమ ఉందా హిందువులు కార్తీక మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలగి, పుణ్యగతులు సిద్ధిస్తాయని విశ్వాసం. By Archana 02 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update karthika masam 2024 షేర్ చేయండి karthika masam 2024: హిందువులు కార్తీక మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి దీపారాధన చేస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే కలిగే పుణ్య ఫలం.. ఈ ఒక్క నెలలో చేసే పూజలకు కలుగుతుందని నమ్ముతారు. అయితే కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం.. ప్రత్యేకించి కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి పౌర్ణమి వంటి పర్వదినాల్లో శివాలయాల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం, శ్రేష్టం. అయితే కార్తీక దీపాలను ఆవు నెయ్యి, నువ్వుల నూనెతోనే వెలింగించడం వెనుక ఓ ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.. Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..! దీపాలు నువ్వుల నూనె, ఆవు నెయ్యితోనే ఎందుకు కార్తీక మాసంలో ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలగి, పుణ్యగతులు సిద్ధిస్తాయని విశ్వాసం. అయితే మాసమంతా దీపాలు వెలిగించలేని వారు.. పౌర్ణమి నాడు ఒకేసారి 365 వత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే దైవానుగ్రహం కలుగుతుందని చెబుతారు. అంతేకాదు కార్తీకమాసంలో దీపం పెట్టడం ఆయువును ప్రసాదిస్తుందని నమ్ముతారు. శాస్త్రీయంగా ప్రకారం నువ్వుల నూనె నుంచి వచ్చే పొగ వాసన పీల్చడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుతారు. అందుకే కార్తీక మాసంలో ఉదయం, సాయంత్రం దీపం పెట్టాలని సూచిస్తారు. Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పండితులను సంప్రదించి సూచనలు తీసుకోవడం ఉత్తమం. Also Read: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు! Also Read: బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా #rtv #karthika #karthika masam 2024: మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి