అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే డాక్టర్ సూచించిన టాబ్లెట్స్‌తో పాటు ఉదయాన్నే కొన్ని పానీయాలు తాగడం మంచిది.
అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేసినా, అదుపులో ఉంచుకోకున్నా శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన గుండె రక్తనాళాలు, కిడ్నీలు, మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉండాలంటే రోజూ ఉదయం పూట ఒక గ్లాసు టమాటా రసం తాగాలి. దీంతో గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
హైపర్ టెన్షన్ నియంత్రణలో లేకుంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మందార పూల టీని తాగడం అలవాటు చేసుకోవాలి.
దానిమ్మ రసంలో పాలీఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
నైట్రేట్స్ ఎక్కువగా ఉండే బీట్ రూట్ జ్యూస్‌ను ఉదయం పూట తాగడం వల్ల అధిక రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.