/rtv/media/media_files/2026/01/03/indonesia-2026-01-03-20-43-25.jpg)
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా ఓ వింత చట్టాన్ని అమలు చేస్తోంది. సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి అత్యంత కఠినమైన రూల్స్ అమల్లోకి వచ్చింది. 2022 డిసెంబర్‌లో అక్కడి పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం, మూడేళ్ల అవగాహన కార్యక్రమాల తర్వాత శుక్రవారం (జనవరి 2, 2026) నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు శారీరక సంబంధాలను నేరంగా పరిగణిస్తారు.
Indonesia on Friday began enforcing its newly ratified penal code, replacing a Dutch-era criminal law that had governed the country for more than 80 years. https://t.co/1GZ9X4aILj
— PBS News (@NewsHour) January 2, 2026
వివాహం కాకుండా ఎవరైనా శృంగారం చేస్తే, దానిని నేరంగా పరిగణించి దోషులకు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పెళ్లి చేసుకోకుండా లివ్-ఇన్ రిలేషన్ ఉండే వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా కొన్ని పరిమితులు విధించారు. కేవలం నిందితుల తల్లిదండ్రులు, పిల్లలు లేదా జీవిత భాగస్వామి ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. అయితే, పర్యాటక రంగంపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు, విదేశీ పర్యాటకులకు కూడా ఇది వర్తిస్తుందా లేదా అనే అంశంపై గతంలో చర్చ జరిగింది. కానీ చట్టం ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది.
ఈ చట్టం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. మరోవైపు, దేశంలోని సాంప్రదాయక విలువలను కాపాడటానికి ఈ చట్టం అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. గత మూడేళ్లుగా ప్రజలకు, పోలీసు యంత్రాంగానికి ఈ చట్టంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని అమలుతో ఇండోనేషియా సామాజిక ముఖచిత్రం ఎలా మారుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Follow Us