AI: పరిశ్రమల్లో పెరిగిన ఏఐ వాడకం.. ఉద్యోగ భద్రత డౌటేనా..?

దేశంలో AI-ఆధారిత స్టార్టప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు పరిశ్రమల్లో ఏఐ వాడకం పెరిగింది. సమయం, ఖర్చు, ఉత్పత్తిని పెంచుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ కారణంగా దాదాపు 50శాతం సమయం ఆదా అవుతుంది.

New Update
Artificial Intelligence

Artificial Intelligence: ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నడుస్తోంది. అన్ని రంగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమల్లో కూడా ఏఐ వాడకం పెరిగింది. సమయం, ఖర్చు, ఉత్పత్తిని పెంచుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ కారణంగా దాదాపు 50శాతం సమయం ఆదా అవుతుంది. అయితే ఏఐ రాకతో ఉద్యోగులకు ముప్పు ఏర్పడింది. ఎక్కడ తీసేస్తారోనన్న భయం కూడా కలుగుతోంది. పరిశ్రమల్లో వ్యాపార పరిష్కారాలను ఏఐతోనే పరిష్కరించుకుంటున్నారు. ప్రిలిమినరీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, డాక్యుమెంటేషన్ సపోర్ట్, హెచ్‌ఆర్ పోర్టల్ నావిగేషన్ మొదలైన విధులు ఏఐ చేస్తోంది.  దేశంలో AI-ఆధారిత స్టార్టప్‌లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. కొందరు AI ఆధారిత అప్లికేషన్‌ల అభివృద్ధిపై పని చేస్తుంటే, కొందరు డేటా భద్రత, గార్డ్‌రైల్‌లను అభివృద్ధి చేయడం మొదలైన వాటిపై పని చేస్తున్నారు. 

ఉద్యోగుల్లో భయాందోళన:

కొన్ని స్టార్టప్‌లు వ్యాపారాల కోసం అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తుంటే, కొన్ని వినియోగదారుల ఫోకస్డ్ అప్లికేషన్‌ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. షాపింగ్ సిఫార్సులు అందించడం నుండి ఉత్పత్తుల కోసం సరైన వినియోగదారులను ఎంపిక చేసే వరకు బ్రాండ్ బిల్డింగ్ నుండి ప్రచారాల రూపకల్పన వరకు ఏఐ సహాయం తీసుకుంటున్నారు. ఏఐ రావడం వల్ల ఉద్యోగులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మ్యాన్‌ పవర్‌ను ఎక్కడ తగ్గిస్తారో అని ఆందోళన చెందుతున్నారు. అయితే నిపుణులు మాత్రం ఎంత ఏఐ వచ్చినా  ఉద్యోగాలు పెరుగుతాయో తప్ప తీసివేతలు ఉండవని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మొక్కే కదా అని టచ్‌ చేస్తే.. మీ అంతుచూస్తుంది

Advertisment
తాజా కథనాలు