Blood Cancer: క్యాన్సర్‌లో ఎన్నిరకాలు ఏది ప్రాణాంతకం..?

బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. అలసట, అంటు వ్యాధులు, గాయాలు, బోన్ మ్యారో బ్లడ్‌క్యాన్సర్‌ ప్రారంభ లక్షణాలు. సిబిసి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇది తెలుస్తుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.

Blood Cancer:

Blood Cancer

New Update

Blood Cancer: క్యాన్సర్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో బ్లడ్ క్యాన్సర్ ముఖ్యమైనది. దీనినే హేమటోలాజికల్ క్యాన్సర్ అని కూడా అంటారు. బ్లడ్‌ క్యాన్సర్ అనే పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మరణం. బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. వీటిని ముందుగానే కనిపెట్టి చికిత్స తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మందిని చంపే ఒక వ్యాధి. మరణానికి ఇది రెండో అతిపెద్ద కారణం. క్యాన్సర్లో అనేక రకాలు ఉంటాయి. అయితే క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకుంటే ముందస్తుగా పరీక్షలు చేయించుకొని బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. 

బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు:

అలసట:

  • బ్లడ్‌క్యాన్సర్‌ ప్రారంభ లక్షణాలలో ఇది ఒకటి. అలసట తీవ్రంగా ఉంటే లేదా విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. 

అంటు వ్యాధులు:

  • రక్త క్యాన్సర్ రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఇన్ఫెక్షన్లను పెంచుతుంది. తరచుగా జలుబు లేదా ఏదైనా ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి. 

గాయాలు:

  • చిన్న చిన్న గాయాలు అవ్వడం, ముక్కు నుంచి రక్తస్రావం. చెవుల నుంచి రక్తం కారడం, ప్లేట్‌లెట్స్ లేకపోవడం కూడా క్యాన్సర్‌కి కారకాలు. మెడ, చంక, గజ్జలలో వాపు రావడం కూడా క్యాన్సర్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా జ్వరం, రాత్రి చెమటలు బ్లడ్ లక్షణాలు అంటున్నారు వైద్యులు. చాలామంది ఇన్ఫెక్షన్లు లేకుండా కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొన్ని రక్త పరీక్షలు అవసరం. సిబిసి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇది తెలుస్తుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. 

బోన్ మ్యారో:

  • ఇది ఎముక మజ్జను ప్రభావితం చేస్తుందో లేదో చెబుతుంది. వ్యాధి ఎంతవరకు వ్యాపించిందో కూడా ఇందులో తెలుస్తుంది. తుంటి ఎముకలోకి ఒక సూదిని పంపి ఈ పరీక్షలు చేస్తారు.

ఇమేజింగ్ టెస్ట్:

  • ఇందులో శరీరంలోని గ్రంథులు స్కాన్ చేస్తారు. ఎక్స్రేలు, అల్ట్రా సౌండ్, సిటి స్కాన్ వంటివి నిర్వహిస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ఆహారం తింటే గుండెపోటు అస్సలు రాదు

#blood-cancer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe