శరీర దుర్వాసన సహజం. బస్సులో వెళుతున్నప్పుడు లేదా ఇతర ప్రదేశాలలో పక్కపక్కనే నిలబడి ఉన్నప్పుడు శరీరం దుర్వాసన రావడం గమనించి ఉండవచ్చు. కొన్ని అవయవాల నుండి దుర్వాసన రావడం ప్రారంభిస్తే అది కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణం కావొచ్చు.
సాధారణంగా వ్యాయామం, పనిచేస్తున్నప్పుడు చెమటలు పట్టడం జరుగుతుంది. అయితే చెమటకు ఎలాంటి దుర్వాసన లేకపోయినప్పటికీ చర్మంపై బ్యాక్టీరియాతో కలిసిపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి.
నోటి దుర్వాసన కడుపు సమస్యలు, మధుమేహం, మూత్రపిండ వ్యాధి లేదా శ్వాసనాళంలో సంక్రమణను సూచిస్తుంది. నోరు పొడిబారడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
మూత్రంలో ఎప్పుడూ కొంత వాసన ఉండటం సహజం. కానీ ఈ దుర్వాసన విపరీతంగా ఉందని మీరు గమనించినట్లయితే అది అంతర్గత ఆరోగ్య సమస్య కావచ్చు. మూత్రం దుర్వాసన వస్తుంటే నీరు ఎక్కువగా తాగాలి. కానీ కొన్నిసార్లు ఈ దుర్వాసన UTI, మూత్రాశయ వాపు, మధుమేహం సమస్యలకు కారణం.
చెవి నుండి చీము లేదా చెడు వాసన ఇన్ఫెక్షన్కు కారణం కావొచ్చు. చెవిలో రంధ్రం లేదా కణితి సంకేతం కావచ్చు. చెవులలో దురద, నొప్పి కూడా వస్తుంటుంది.
చంకల నుండి అధిక దుర్వాసన తీవ్రమైన సమస్యలకు సంకేతం. కాబట్టి మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ దుర్వాసన వస్తుంటే వైద్యులను సంప్రదించాలి.