Insomnia:నిద్రలేమి అంటే రాత్రి సరిగ్గా నిద్రపోని పరిస్థితి. ఈ సమస్య వృద్ధులలో సాధారణం. అయితే పెద్దలతో పాటు పిల్లల్లో కూడా నిద్రలేమి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ మనలో కొందరికి నిద్ర సరిగా ఉండదు. లేదా పొద్దున్నే లేవడం, రాత్రి మధ్యలో నిద్ర లేవడం వల్ల ఎంత ప్రయత్నించినా మళ్లీ నిద్ర పట్టదు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ నిద్రలేమి సమస్యలు అంటారు. నిద్రలేమి సమస్య తగ్గాలంటే ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
నిద్రలేమికి కారణాలు:
- ప్రతి ఒక్కరికి నిద్రలేమికి వేర్వేరు కారణాలు ఉంటాయి. నిద్రలేమి ఎందుకు వస్తుందో వైద్యులకు కూడా ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ దైనందిన జీవితంలో ఒత్తిడి, అలసట, మనస్సులో కొన్ని అనివార్య సమస్యలు, ఇతర అంశాలు దీనికి కారణం కావచ్చంటున్నారు.
పడుకునే ముందు ఇలా చేయండి:
- ప్రతిరోజూ ఒక సాధారణ నిద్ర షెడ్యూల్ పెట్టుకోవాలి. ఉదయం లేవడం కూడా ఒకే సమయంలో ఉండాలి. తినేవి, తాగేవి కూడా నిద్ర నాణ్యతలో పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిద్రవేళకు రెండు గంటలలోపు ఎక్కువగా భోజనం చేయొద్దు. కెఫీన్, ఆల్కహాల్ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత మద్యం మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నిద్రించే ముందు పాలు, టీ తాగితే నిద్రబాగా పడుతుందంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాత్రి తినకుండా పడుకుంటే ఇన్ని రోగాలు వస్తాయా..?