Holika dahan 2026: హోలికా దహనం: ఆ బూడిద ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలే!

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ పండుగకు ఒక రోజు ముందు హోలికా దహనం జరపుకుంటారు. అయితే హోలికా దహనంలో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లో పాత వస్తువులతోపాటు ఎండిన కొమ్మలు వంటివి వేసి మంటలు వెలిగిస్తారనే విషయం తెలిసిందే.

New Update
holika dahan 2026

holika dahan 2026

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ పండుగకు ఒక రోజు ముందు హోలికా దహనం జరపుకుంటారు. అయితే హోలికా దహనంలో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లో పాత వస్తువులతోపాటు ఎండిన కొమ్మలు వంటివి వేసి మంటలు వెలిగిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ పవిత్రమైన మంటల నుంచి వచ్చే బూడిదకు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ప్రాముఖ్యత ఉందని కొందరు చెబుతున్నారు. ఈ బూడిద ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయని ప్రజల బలమైన నమ్మకం. 

రాహు, కేతు దోషాల నివారణ

ఇక హోలికా దహనం కోసం చెకుముకిరాయితో మంటలను వెలిగిస్తారు. దహనం తర్వాత జీవితంలో భయాలు, కష్టాలు, దుఃఖాలు తొలగిపోవాలని కోరుకుంటూ వేడి బొగ్గులపై నడుస్తారు. ఇదే క్రమంలో తమ దురదృష్టాలను పారద్రోలేందుకు హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదను ఇంటికి తెచ్చుకుంటారు. హోలికా దహనం బూడిదతో కొంతమంది స్నానం చేస్తే.. మరి కొందరు ఇంట్లో చల్లుకుంటారు. అయితే ఇంట్లో ఈ బూడిద చల్లడం వల్ల బ్యాక్టీరియా నశించిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ భస్మాన్ని శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా జాతకంలో రాహు, కేతు ప్రభావాలు తగ్గిపోతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యం, ఐశ్వర్యం

ఇక ఈ బూడిదలో శక్తివంతమైన వైద్య గుణాలుంటాయని బలమైన విశ్వాసం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక నెలపాటు ఈ బూడిదను బొట్టు పెట్టుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఇక ఈ బూడిదను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి ఒక నాణెం అందులో పెట్టి మూట కట్టి లాకర్లో ఉంచుతారు. ఇలా చేస్తే ఆదాయ వనరులు సమకూరుతాయని నమ్ముతారు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబాల్లో గొడవల తగ్గిపోయి ప్రేమను పంచుకునేలా ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు