'చిరునవ్వుతో చంపే మొక్క'.. దీని వెనుక భయంకరమైన విషయాలివే!

హెమ్లాక్ వాటర్ డ్రాప్‌వోర్ట్ ప్లాంట్ దీనిని 'చిరునవ్వుతో చంపే మొక్క' అని కూడా పిలుస్తారు. ప్రమాదవశాత్తు ఈ మొక్కను తీసుకుంటే, ఫేస్ పెరాల్సిస్ సంభవించి.. వ్యక్తి ముఖం నవ్వుతున్నట్లు కనిపించే విధంగా కుంచించుకుపోతుంది.

New Update
Hemlock water dropwort plant

Hemlock water dropwort plant

Hemlock water dropwort:  'చిరునవ్వుతో చంపే మొక్క'.. ఇలాంటి మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా.  ఇది మృతుడి మొహం పై చిరునవ్వు ఉండేలా చేస్తుంది. 'హెమ్లాక్ వాటర్ డ్రాప్‌వోర్ట్' అని పిలవబడే ఈ మొక్క అడవిలో కనిపించే అత్యంత అసాధారణమైన  మొక్కల్లో ఒకటి. ఇది సార్డినియా వంటి అడవి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ మొక్క ప్రాణాలకే ప్రమాదం. దీనిలోని విషపూరిత లక్షణాలు ఒక వ్యక్తిని పారలైజ్ చేసి.. మరణానికి కారణమవుతాయి. అయితే దీనివల్ల వచ్చే మరణం సాధారణంగా ఉండదు.  ప్రమాదవశాత్తు ఈ మొక్కను తీసుకుంటే, ఫేస్ పెరాల్సిస్ సంభవించి.. వ్యక్తి ముఖం నవ్వుతున్నట్లు కనిపించే విధంగా కుంచించుకుపోతుంది. అందుకే దీనిని 'చిరునవ్వుతో చంపే మొక్క' అని కూడా అంటారు. 

ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

పురాతన ఆచారం 

అంతేకాదు ఈ మొక్క వెనుక ఓ పురాతన  ఆచారం కూడా దాగి ఉంది. అయితే అప్పట్లో సార్డీనియాలో  సమాజానికి భారంగా భావించే వృద్ధులను చంపేయడానికి ఈ మొక్కను ఉపయోగించేవారట. దీని తీసుకున్న తరువాత, బాధితులు మరణానికి గురవుతారు. ఎంతో అందంగా కనిపించే   'హెమ్లాక్ వాటర్-డ్రాప్‌వోర్ట్'  దాని ప్రాణాంతక లక్షణాల కారణంగా అపఖ్యాతి పాలైనప్పటికీ..  కొంతమంది శాస్త్రవేత్తలు దీని విషాన్ని ఉపయోగించి వైద్య చికిత్సలు చేయాలని పరిశోధిస్తున్నారు. 

మెడిసినల్ బెనిఫిట్స్ 

సాధారణంగా పక్షవాతాన్ని ప్రేరేపించే  ఈ మొక్కలోని విషపూరిత పదార్థాలను..  పక్షవాతం చికిత్సకు, ఇతర పరిస్థితులకు  ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే  కండరాలను సడలించడానికి,  కండరాల సమస్యలు లేదా నరాల గాయాలను బహుకాలంగా చికిత్స చేయడంలో ఈ మొక్క  ఉపయోగపడవచ్చని డాక్టర్ మౌరో బల్లెరో వంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. 

life-style | health | Hemlock water dropwort plant

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
తాజా కథనాలు