ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో రకరకాల వ్యాధులు వస్తాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 7 గంటల నిద్ర అవసరం. అయితే, రోజుకు ఎంత నిద్ర అవసరమో వ్యక్తి వయస్సు మీద ఆధారపడి ఉంటుందట.
ఏ వయస్సు వారికి ఎంత నిద్ర అవసరం అంటే..
4 నుండి 12 నెలల పిల్లలకు 16 గంటల నిద్ర అవసరం. 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 14 గంటలు నిద్రపోవాలి. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు 12 గంటలు నిద్రపోవాలి. 13 నుంచి 18 సంవత్సరాల వయస్సు పిల్లలు 10 గంటల వరకు నిద్రపోవాలి. 18 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కనీసం 7 గంటల నిద్ర మంచిది.