ఈరోజుల్లో ఎక్కువ శాతం మంది బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. ఇలా జంక్‌ఫుడ్ అధికంగా తినడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే ఊబకాయులుగా మారుతున్న వారికి తొందరగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సహ ఆచార్యుడు అనిల్‌కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్‌రెడ్డి పరిశోధన చేశారు.
ఇది కూడా చూడండి: లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో.. నాలుగోరోజు అమ్మవారు దర్శనం
ఎలుకల మీద ప్రయోగం..
దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఊబకాయుల సంఖ్య పెరగడంతో వారి ఆరోగ్యంపై పరిశోధనలు చేయాలని నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో చుంచు ఎలుకలు, పుట్టుకతోనే ఊబకాయంతో ఉన్న విస్టార్ ఎలుకలపై కూడా ప్రయోగాలు చేశారు. వీటికి కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వడంతో పాటు జంక్‌ఫుడ్‌ను కూడా ఇచ్చారు. అధికంగా వీటిని తినడం వల్ల కొన్ని నెలలకు ఆ ఎలుకలు ఊబకాయం సమస్య బారిన పడ్డాయి.
ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్
ఎలుకల మూత్రం నుంచి కూడా ఎక్కువగా ప్రొటీన్యూరియా బయటకు వచ్చేది. ఇలా కిడ్నీలు దెబ్బతింటున్నాయని భావించారు. అయితే ఇందులో నిజమెంత అని తెలుసుకోవడానికి వచ్చిన ఫలితాలతో మనుషులకు సంబంధించిన డేటాతో పోల్చి చూశారు. ఊబకాయం ఉన్నవారు తొందరగా మూత్రపిండాల వ్యాధి బారిన పడతారని, వాటిని పనితీరు కూడా దెబ్బతింటుందని పరిశోధనలో తేల్చారు. ఇంకా శాస్త్రీయ ఆధారాల కోసం ఊబకాయం సోకిన వారి ఆరోగ్య పరిస్థితులను, ఎలాంటి జబ్బులు సోకుతున్నాయనే పరిశోధనలు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్