రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాల తక్కువగా ఉండటాన్ని రక్తహీనతగా గుర్తిస్తారు. రక్తంలోని హిమోగ్లోబిన్ మన శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు ఆక్సిజన్‌ను అందిస్తోంది. హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోయిన వారిలో రక్తం ... శరీర అవయవాలకు అందకపోతే వారి శరీరం చచ్చుబడిపోతుంది.సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ లోపంతో అనీమియా వస్తోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆఫీస్ లో నిలబడి పని చేసేవాళ్లకు షాక్.. ప్రాణాలకే ప్రమాదం! పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఆకుకూరలు, లివర్, ద్రాక్ష..
ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్‌ల్లో హిమోగ్లోబిన్ ఒకటి. హిమోగ్లోబిన్ తగినంత ఉంటేనే ఆరోగ్యంగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఐరెన్ అధికంగా లభించే ఆకుకూరలు, లివర్, ద్రాక్ష, నల్లనువ్వులు, చేపలు తీసుకుంటే రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు. గుమ్మడి గింజలు, పిస్తా, పొద్దు తిరుగుడు విత్తనాలు, జీడిపప్పుతోపాటు డ్రైఫ్రూట్స్ తీసుకుంటే రక్తహీనతతోపాటు పలు వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి: Buttermilk: మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చేశారంటే మంచి ఉపశమనం