EYE Tips: ఈ మిస్టేక్ చేస్తే కంటి చూపు సమస్య.. ఇలా జాగ్రత్త పడండి!

జ్ఞానేంద్రీయాల్లో అత్యంత ముఖ్యమైనది, సున్నితమైనది కన్ను. ఇటీవలి కాలంలో చాలా మంది కన్ను సంబంధింత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం తగిన జాగ్రత్తలు చూపకపోవడమే. కంటి చూపు సమస్య రావొద్దనుకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

New Update

సాధారణంగానే వయసు పెరిగే కొద్దీ కంటి చూపు, కంటి ఆరోగ్యం మందగిస్తాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోతే కూడా.. తర్వరగానే కంటి చూపు తగ్గుతుంది. అందుకే కంటి ఆరోగ్యానికి బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ చాలా ఇంపార్టెంట్. విటమిన్లు A, C, E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. 

ఎక్కువ నీళ్లు తాగాలి..

తక్కువ వెలుతురులో, రాత్రి సమయంలో చూడలేకపోవడం, చిన్న వయస్సులోనే బ్రైట్‌ లైట్‌ని చూడలేకపోవడం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, కళ్లు పొడిబారిపోవడం లాంటి లక్షణాలను.. ఐస్ ఏజింగ్‌ అంటారు. డీహైడ్రేషన్ వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అందుకే నీరు కూడా ఎక్కువగా తాగాలి.

Advertisment
తాజా కథనాలు