హైపర్ హైడ్రోసిస్.. దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. విపరీతమైన చెమటలు పట్టే శారీరక స్వభావం కలిగిన వారిలో.. ఈ వ్యాధి వస్తుంటుంది. చాలా కాలం ఇలా అధికంగా చమటలు పట్టడం కొనసాగితే.. బ్రొమిడోసిస్ అనే బ్యాక్టీరియా శరీరంలో డెవలప్ అవుతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
నిర్లక్ష్యం చేస్తే డేంజర్..
హైపర్ హైడ్రోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఎర్రటి, నీలం రంగు చెమటతో కూడిన క్రోమిడ్రోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది. అధిక చెమటలు ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ఇందుకు శాశ్వత పరిష్కారం లభించాలంటే.. స్వేద గ్రంధుల్లో దుర్వాసనను నివారించే ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.