ఉపవాసం ఎప్పుడు చేయాలి? సైన్స్ ఏం చెబుతోంది?

శాస్త్రవేత్తలు ప్రకారం.. ఉపవాసానికి శనివారం లేదా ఇతర వారం అనే ప్రత్యేకత ఏమీ లేదు. ఆరోగ్యం కోసం ఏ రోజైన ఉపవాసం చేయొచ్చు. అలాగే ఉపవాసం చేస్తే సమస్యలు తగ్గుతాయి, దేవుడి అనుగ్రహం లభిస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే.

New Update
fasting

fasting Reasons

Fasting:  భారతీయ సంస్కృతిలోఉపవాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శనివారం ఉపవాసం చేస్తే శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందని, సమస్యలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఉపవాసం చేస్తే సమస్యలు తగ్గుతాయి, దేవుడి అనుగ్రహం లభిస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. అనుభవజ్ఞులైన వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రకారం.. ఉపవాసానికి శనివారం లేదా ఇతర వారం అనే ప్రత్యేకత ఏమి లేదు. ఆరోగ్యం కోసం ఏ రోజైన ఉపవాసం చేయొచ్చు. మరో విషయం ఏంటంటే సైన్స్ ప్రకారం శనేశ్వరుడు అనేది కేవలం ఒక గ్రహం మాత్రమే.. దేవుడు కాదు. అలాగే ఈ  గ్రహం మన జీవితంపై ప్రభావం చూపుతుంది అనడానికి ఎలాంటి శాస్త్రీయ ప్రామాణికత లేదు. 

ఉపవాసం ఎందుకు అవసరం.. సైన్స్ ఏం చెబుతోంది..? 

ఉపవాసం అనేది ఆరోగ్యానికి మేలు చేసే ఓ ప్రక్రియ. ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకుండా ఉండడమే కాదు. శరీరానికి కొంత సమయం విశ్రాంతి ఇవ్వడం. ప్రతిరోజూ తినడం వల్ల శరీరం నిరంతరం జీవక్రియలో నిమగ్నమై ఉంటుంది. కావున ఒక రోజు ఉపవాసం చేయడం ద్వారా శరీరం ఇతర అవసరాలపై కూడా శ్రద్ద పెడుతుంది. ముఖ్యంగా టాక్సిన్లను తొలగించడం, జీర్ణక్రియకు బ్రేక్ ఇవ్వడం మొదలైనవి. అంతే కానీ ఉపవాసం చేస్తే సమస్యలు తొలగిపోతాయనేది అపోహ మాత్రమే. 

Also Read: మిస్‌ యూనివర్స్‌ 2024.. 21ఏళ్ల భామకు విశ్వసుందరి కీరిటం!

ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు 

వారంలో ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మెటబాలిజం కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఉపవాసం శరీరాన్ని సహజ సిద్ధంగా శుభ్రపరుచుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లు తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

ఫాస్టింగ్ రకాలు.. ఎప్పుడు చేయాలి?

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ :

ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఇందులో ఉదయం  8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తినవచ్చు. మిగతా 12 గంటలు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇలాంటి ఉపవాసం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతారు. అలాగే బరువు తగ్గడానికి, డీటాక్స్ చేయడానికి దీనిని సరైన పద్దతిగా భావిస్తారు. 

 కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉపవాసం.. 

ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం మంచిది. ఉదాహరణకు.. భోజనం కాకుండా ఒక్క రోజు పండ్లు, నీళ్లు తీసుకుంటే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: కీర్తిసురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు మరెవరో కాదు..!

Advertisment
తాజా కథనాలు