సుఖమైన నిద్ర కోసం.. తప్పక పాటించాల్సిన నియమాలివే!

రాత్రిపూట నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు దూరంగా ఉంటూ, గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తొందరగా భోజనం చేయడంతో వ్యాయామం కూడా చేయడం వల్ల బాగా నిద్రపడుతుంది.

happy-mornings-beautiful-young-woman-sleeping-whi-2023-11-27-05-10-04-utc (1)
New Update

నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి ముఖ్యమైనది. రాత్రిపూట హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే రోజంతా నీరసం, అలసటగా ఉంటారు. కొందరు పడుకునే ముందు మొబైల్‌ లేదా టీవీ చూడటం వంటివి చేస్తుంటారు. వీటివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. రాత్రి సమయంలో సుఖంగా నిద్రపోవాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: దూసుకొస్తున్న దానా తుఫాన్‌.. గంటకు 120 కి.మీ వేగంతో..

వీటికి దూరంగా ఉంటే..

రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే తొందరగా భోజనం చేయాలి. తినే ఫుడ్ జీర్ణం అయితేనే నిద్రపడుతుంది. లేకపోతే కడుపు నిండుగా ఉండటం వల్ల నిద్రపట్టదు. అలాగే నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి కాస్త దూరంగా ఉండాలి. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను పక్కన పెట్టాలని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!

హాయిగా నిద్రపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు నీరు తాగాలి. చల్లని కంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతారు. అలాగే నిద్రపోయే ముందు ఫ్రెష్ అవ్వడం మంచిది. స్నానం చేసి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్రపోతారు. 

ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?

ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిద్రపోవాలంటే రాత్రిపూట వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల బాడీ బాగా అలసి పోతుంది. దీంతో రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా నిద్రపోయే ముందు ఈ నియమాలు పాటించండి.

ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#good-sleep
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe