Bitter Gourd: చక్కెరతో ఇలా చేశారంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే

జుట్టు రాలే సమస్యకు కాకరరసం ఔషధంగా పనిచేస్తుంది. అరకప్పు కాకరరసంలో కొబ్బరి నూనె కలిపి జుట్టు, మాడుకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. 40 నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుస్లారు చేయాలి.

Bitter Gourd Juice

Bitter Gourd Juice

New Update

Bitter Gourd: ఈ రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం, తెల్లజుట్టు వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఖరీదైన షాంపూలు, ఆయిల్స్‌ వాడినా ఫలితం ఉండటం లేదు. అవన్నీ అక్కర్లేదు కేవలం కాకరరసం చాలు అంటున్నారు నిపుణులు. కాకరరసం జుట్టుకు పట్టించడం వల్ల సమస్యలు తగ్గిపోతాయని, కుదుళ్లు దృఢంగా, ఒత్తుగా తయారవుతాయంటున్నారు. మరి కాకర రసాన్ని ఎలా అప్లై చేయాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

కాకర మంచి మందుగా పనిచేస్తుంది:

చేదు అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. కాకరకాయ రసం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మం, జుట్టు సమస్యలను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. పొడిబారిన జుట్టు సమస్యకు కూడా కాకర మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ బి1, బి2, బి3, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫాస్పరస్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. జుట్టు రాలే సమస్యకు కాకరరసం ఔషధంగా పనిచేస్తుంది. అరకప్పు కాకర రసంలో  కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. 40 నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు అప్త్లె చేస్తే సమస్య అదుపులోకి వస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ దేశంలో ఎవరూ పిల్లల్ని కనరు..ఎందుకో తెలుసా?

వెంట్రుకలు నిస్తేజంగా ఉండి, మెరుపు కోల్పోయి ఉంటే, కాకరకాయను రసాన్ని ఉపయోగించవచ్చు. మీకు జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే కాకరకాయ రసంలో పంచదార కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే.. క్రమంగా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా కాకరకాయ జ్యూస్‌ను ఉపయోగించవచ్చు. కాకరకాయలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా కాకరకాయ రసం రక్త ప్రసరణకు సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఒక గూడులో వందకు మించి గుడ్లుపెట్టే పక్షి ఏంటో తెలుసా..?

#bitter-gourd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe