Viral Video: గురుగ్రామ్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గరికి రాగానే సరిగా కనిపించక అన్ని వాహనాలు గాల్లోకి తేలుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 91 వీల్స్ ఎడిటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బన్నీ పునియా షేర్ చేసిన ఈ వీడియోలో కార్లు వేగంతో వచ్చి స్పీడ్ బ్రేకర్‌కి తగలగానే గాల్లో చాలా ఎత్తులో ఎగిరిపడుతున్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద లారీలు సైతం గాల్లోకి ఎగురుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని అంతా భయాందోళనకు గురవుతున్నారు.
రోడ్డులో స్పీడ్ లిమిట్ నిబంధనలు పెట్టాలని..
హెచ్‌ఆర్ 26 ధాబాకు ఎదురుగా సెంట్రమ్ ప్లాజాకు సమీపంలో ఈ స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించారు. ఇక్కడ ఎలాంటి గుర్తులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నాయి. వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో వినియోగదారులు స్పాట్‌ను ధృవీకరించారు. ఇది సెంట్రమ్ ప్లాజా భవనం తర్వాత ఉందని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు, HR26 ధాబాకు ఎదురుగా ఉందని అంటున్నారు. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ నిబంధనలు పెట్టాలని, కనీసం హెచ్చరిక బోర్డులు అయినా ఏర్పాటు చేయాలని స్థానికులు అంటున్నారు.
ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉందని, ఏదైనా జరిగితే ప్రాణనష్టం భారీగానే ఉంటుందని అంటున్నారు. అయితే అక్కడ యూటర్న్ ఉండటం వల్లే అధికారులు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారని అంటున్నారు. కానీ చీకట్లో వచ్చేవారికి స్పీడ్ బ్రేకర్ కనిపించక అంతే స్పీడ్‌తో వెళ్తుండటంతో వాహనాలు ఒక్కసారిగా ఎగిరిపడుతున్నాయని వాహనదారులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ఇంట్లో ఏసీ 20 డిగ్రీల కంటే తక్కువ పెడితే ఇక అంతే