/rtv/media/media_files/2025/09/03/lunar-eclipse-2025-09-03-14-29-40.jpg)
lunar eclipse
Chandra Grahan 2025: సెప్టెంబర్ 7న అంటే ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రుడు, భూమి, సూర్యడు ఒకే సరళ రేఖ పైకి వచ్చనప్పుడు ఈ గ్రహణం సంభవిస్తుంది . ఈ సమయంలో భూమి చంద్రుడి నుంచి వచ్చే కాంతిని అడ్డుకోవడం వల్ల చంద్రుడి పై నీడ ఏర్పడి అంతా చీకటిగా కనిపిస్తుంది. దీని ఫలితంగా భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీనినే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఇండియన్ టై ప్రకారం.. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటల వరకు ఉంటుంది. సుమారు 100 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ అరుదైన చంద్రగ్రహణం ఏర్పడుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.
A total lunar eclipse, also known as a 'blood moon', will occur on Sunday 7th September.
— Scarlett Fox (@foxonameadow) September 1, 2025
The eclipse will be at its peak visibility at 7.33pm in the UK, shortly after moonrise. Choose a high vantage point as the moon will be low on the horizon. pic.twitter.com/Q4LTuZlcHH
గ్రహణ యోగం
అయితే చంద్రగ్రహ ణానికి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 6న ఒక ప్రమాదకరమైన గ్రహణ యోగం ఏర్పడుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... రాహువు చంద్రునితో కలిసి కుంభరాశిలో కూర్చుంటాడు. దీని వల్ల కుంభరాశిలో గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశి చక్రాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మిథున రాశి
చంద్రుడు, రాహువు కలయిక వల్ల వల్ల మిథున రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
కన్యరాశి
అలాగే కన్యరాశి వారు సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. ఏదైనా పెద్ద కార్యాలు తలపెట్టేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం మంచింది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు కూడా గ్రహణ యోగం ఏర్పడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం, సైన్ చేయడం వంటివి చేయరాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎవరితూనూ గొడవ పడకండి. సింహ రాశి వారు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో తొందర పడకండి. డబ్బు , సంబంధాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి.
Also Raed: Blood Moon: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!