Cloths : రాత్రి ఈ దుస్తులు వేసుకోండి.. ఆరోగ్యానికి మంచిది!

ప్రైవేట్ పార్ట్‌లు విశ్రాంతి పొందాలంటే రాత్రి లోదుస్తులు ధరించి నిద్రపోవడం మానేయడం మంచిది. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రించడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, దద్దుర్లు, చికాకు కలిగించే అవకాశం ఉంటుదట.

author-image
By Vijaya Nimma
Health Tips
New Update

Health Tips : రాత్రి పడుకునేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు ధరించాలి. లేకుంటే ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మహిళలు రాత్రిపూట బిగుతైన బట్టలు వేసుకుని నిద్రపోతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించి నిద్రపోవడం మహిళలకే కాదు పురుషుల ఆరోగ్యానికి కూడా హానికరం. నిజానికి రాత్రి పడుకునేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. రాత్రిపూట బట్టలు వేసుకుని నిద్రపోకూడదని లేదా రాత్రిపూట వదులుగా ఉండే నైట్ సూట్ వేసుకుని పడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు రాత్రి సరైన దుస్తులు ధరించి పడుకుంటారా..? ఈ ప్రశ్న కొంచం ఇబ్బందిగా ఉండోచ్చు.. కానీ బెడ్‌లో సరైన పద్ధతులు, వస్తువులను ఉపయోగించక పోవడం నిద్ర, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందట. అయితే నిద్రించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మార్పులు వస్తయట. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  వర్షాకాలంలో ఈ ఆహారాలను తినేటప్పుడు జాగ్రత్త..!

రాత్రి లోదుస్తులు వల్ల కలిగే నష్టాలు:

రాత్రిపూట లోదుస్తులు ధరించి నిద్రపోవడానికి ప్రతి ఒక్కరికి వేర్వేరు కారణాలు ఉండవచ్చు. కొందరికి లోదుస్తులు ధరించి నిద్రపోవడం సుఖంగా ఉంటుంది. మరికొందరు వదులుగా ఉన్న బట్టలు ధరించి నిద్రపోవడం విశ్రాంతిగా భావిస్తారు. అయితే.. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రించడం హానికరం. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రిస్తున్నప్పుడు, చర్మం స్వేచ్ఛగా శ్వాస తీసుకోదు. అందుకని ప్రైవేట్ పార్ట్‌లు విశ్రాంతి పొందాలంటే రాత్రి లోదుస్తులు ధరించి నిద్రపోవడం మానేయడం మంచిది. రోజంతా బ్రా, ప్యాంటీ ధరించడం వల్ల యోని చుట్టూ తడి, తెల్లటి ఉత్సర్గ వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది స్త్రీలలో యోని ఇన్ఫెక్షన్, వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Also Read :  లోషన్లు, సన్‌స్క్రీన్, ఆయిల్స్ వల్ల పిల్లలో హార్మోన్ల లోపాలు

ఎలాంటి దుస్తులు ధరించాలి:

రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉన్నప్పటికీ... మీరు హాయిగా నిద్రపోయినా ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. వదులుగా ఉండే టి-షర్టు, పైజామా, నైట్ సూట్ ధరించి పడుకోవడం మంచిది. దీనివల్ల ప్రైవేట్ పార్ట్‌లలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. శరీర భాగాలన్నీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతాయి. స్కిన్ ఇన్‌ఫెక్షన్ ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. రాత్రిపూట యోని pH స్థాయిని సరిగ్గా ఉంచడం చాలా ముఖ్యం. దీంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ లోదుస్తులు లేకుండా నిద్రించడం మంచిది. యోని ఎప్పుడూ తడిగా ఉంటుంది. దీనివల్ల ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఫంగస్, బ్యాక్టీరియా పెరగకుండా ప్రైవేట్ భాగాలను పొడిగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి కాటన్ పైజామా నైట్‌వేర్‌లకు ఉత్తమమైనది. ఇది సహజమైన ఫైబర్, ఇది చాలా మృదువైనది, సౌకర్యవంతమైనది, తేలికైనదిగా ఉంటుంది. ఇలాంటి వాటిని వేసుకుంటే మంచి రాత్రి నిద్ర వస్తుంది. అదనంగా చర్మాన్ని సులభంగా శ్వాసించడానికి అనుమతిస్తుంది. దద్దుర్లు, చికాకు కలిగించే అవకాశం తక్కువగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  బోడకాకర గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  గర్భం దాల్చిన ఎన్ని నెలల వరకు సె*క్స్ చేయకూడదు? ఈ విషయాలు మీకు తెలుసా?

#cloths #health-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe