Belly Dance: కత్తిలాంటి అమ్మాయి కత్తి పడితే ఇలా ఉంటది

ఛత్తీస్‌గఢ్ అమ్మాయి తలపై కత్తిని బ్యాలెన్స్ చేస్తూ బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లావణ్యదాస్ మాణిక్‌పురి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకి మంచి స్పందన వస్తోంది. డ్యాన్స్‌లో స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు.

New Update
Belly dance

Belly Dance

Belly Dance: ఛత్తీస్‌గఢ్ మహిళ తన తలపై కత్తిని బ్యాలెన్స్ చేస్తూ బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ హిట్ చిత్రం ఓంకారలోని నమక్ పాటకు తలపై కత్తి పెట్టుకుని యువతి చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లావణ్య దాస్ మాణిక్‌పురి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకి మంచి స్పందన వస్తోంది. బీట్‌కు తగ్గ స్టెప్పులతో చూసేవారి హార్ట్‌ బీట్‌ పెంచుతోంది ఈ భామ. వీడియోలో లావణ్య బ్లాక్ బ్లౌస్‌, స్కర్ట్ ధరించి డ్యాన్స్‌ చేసేముందు కత్తిని జాగ్రత్తగా తన తలపై ఉంచింది. 


చేతి కదలికతో కత్తిని బ్యాలెన్స్‌...

 

 

ఇది కూడా చదవండి: దీపావళి రోజు కాళీ పూజ ఎలా చేయాలి?

ఆమె ఫుట్‌వర్క్, చేతి కదలికతో కత్తిని బ్యాలెన్స్‌ చేసింది. చాలాసార్లు కత్తి కింద పడబోయినా జాగ్రత్తగా మళ్లీ సెట్‌ చేసింది. ఆమె డ్యాన్స్‌ చూసేవారికి మాత్రం ఉత్కంఠ రేపింది. ఇంత డ్యాన్స్‌ చేసినా కత్తి కదల్లేదు. కాకపోతే కత్తి మాత్రం పురాతన కాలంనాటిదా అంటూ సరదాగా ఆమె పోస్ట్‌కు క్యాప్షన్‌ పెట్టారు. ఎంతో బ్యాలెన్సింగ్‌గా డ్యాన్స్‌ చేసిందంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  అద్భుతంగా స్టెప్పులు వేసిందని, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వీడియో ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: రియల్‌ హీరో.. చేతులు లేకపోయినా తగ్గేదే లే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు