Frozen Foods: నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఒకేసారి ఎక్కువ ఆహార పదార్థాలను తెచ్చుకొని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం చేస్తుంటారు. కొంతమంది నెలలు తరబడి వాటిని అలాగే ఫ్రిడ్జ్ లోనే ఉంచి తింటుంటారు. అయితే చేపలు, మాంసం, పండ్లు వంటి ఆహారాలను నెలల తరబడి నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. చాలా మంది ఫ్రీజర్లో పెడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందనే అపోహలో ఉంటారు. నిజానికి ఫ్రీజర్లో ఉంచే.. ప్రతి ఆహారానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. ఇలా కావాల్సిన కంటే ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల పదార్థాలు విషపూరితంగా లేదా హానికరంగా మారవచ్చు.
Also Read: ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ఏ ఆహారాన్ని ఎంత సమయం నిల్వ చేయాలి?
రెడ్ మీట్‌ను రెండు నెలలకు మించి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకూడదు. సాల్మన్, సారడైన్ లాంటి ఫ్యాటీ ఫిష్ లను నెల రోజులు ఉంచాలి. పౌల్ట్రీ మాంసంను మూడు నెలల వరకు నిల్వ చేయవచ్చు. కొవ్వు లేని చేపలు రెండునెలల వరకు నిల్వ చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం టమోటాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం ఉంచరాదు. ఫ్రిడ్జ్ లోని చల్లదనం, తేమ కారణంగా ఫంగస్ ఏర్పడి విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది.
టమోటా
పరిశోధనల ప్రకారం లైకోపీన్ అనేది టమోటాలలో ఉండే కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్. ఇది వాటికీ ఎరుపు రంగును ఇస్తుంది. టొమాటోలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు, ఫ్రీజర్‌లోని చల్లదనం లైకోపీన్ నిర్మాణాన్ని మారుస్తుంది. అది గ్లైకోఅల్కలాయిడ్‌గా మారుతుంది. ఈ టొమాటిన్ గ్లైకోఅల్కలాయిడ్ శరీరానికి హానికరం.
వెల్లుల్లి
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులో ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి మేలు జరగదు. చాలా సార్లు ప్రజలు ఒలిచిన వెల్లుల్లిని కొనుగోలు చేస్తారు, ఎందుకంటే ఇది చౌకగా ఉంటుంది. ఇలా చేయకండి, ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే