Diet: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ డైట్ ఫాలో కండి డైట్ ఫాలో చేసేవాళ్లు రోజువారీ ఆహారంలో సాల్మన్, సార్డినెస్, గుడ్లు, పెరుగు, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్యానికి మంచిది. పసుపు, దాల్చినచెక్క, రోజ్మేరీ, సేజ్ వంటి మూలికలు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. By Vijaya Nimma 23 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 మనం ఏది తిన్నా అది అనుసరించే జీవనశైలి, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి, ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 2/7 పోషకాహారం తీసుకోవడం వల్ల మెదడు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 3/7 బ్రోకలీ, బచ్చలికూర, బీట్రూట్, ఉల్లిపాయలు, టమోటో వంటి కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో ఈ కూరగాయలను చేర్చుకోవడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 4/7 యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, సీజనల్ ఫ్రూట్స్ తక్కువ చక్కెర కంటెంట్ కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 5/7 రోజువారీ ఆహారంలో సాల్మన్, సార్డినెస్, గుడ్లు, పెరుగు, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పసుపు, దాల్చినచెక్క, రోజ్మేరీ, సేజ్ వంటి మూలికలు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. 6/7 అవిసె గింజలు, చియా గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, వాల్నట్లు, బాదంపప్పులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #diet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి