మనం ప్రతి కొన్ని సెకన్లకు కనురెప్ప వేస్తూనే ఉంటాం. నిద్రించే సమయంలో అయితే పూర్తిగా కళ్లు మూసుకుని పడుకుంటాం. అయితే కొన్ని జీవులు మాత్రం ఎప్పుడూ కళ్లు తెరిచే ఉంటాయి.
ఈ ప్రపంచంలో మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. భూమిపై ఎప్పుడూ కళ్ళు మూసుకోని ఒక జీవి ఉంది. నిద్రపోతున్నప్పుడు కూడా కళ్లు తెరిచే ఉంటాయి.
నిజానికి చేపలకు కనురెప్పలు ఉండవు. అవి కళ్లు మూసుకోలేవు, అంతేకాకుండా వాటి నిద్రించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
కనురెప్పలు లేకుండా కూడా చేపలు నిద్రిస్తాయి. కాకపోతే మనుషులు నిద్రించినంత సేపు అవి నిద్రపోలేవు. ఏదైనా చిన్న అలికిడి అయితే వెంటనే మేల్కొంటాయి.
చేపల కళ్ల నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. వాటి కార్నియా ఇతర జంతువుల కంటే చాలా మందంగా ఉంటుంది. ఎందుకంటే అవి నీటి అడుగున ఒత్తిడికి గురవుతాయి. కంటి కణజాలం దాని నుండి రక్షించబడాలి అందుకే ఈ మందపాటి పొర చేపల కళ్లను రక్షిస్తుంది.
కొన్ని చేపలు మిగతావాటితో తొందరగా కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తాయి. ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి కళ్లపైనే ఆధారపడతాయి. చేపల కంటి కండరాలు చాలా బలంగా ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కూడా చేపలు ఈత కొడుతూనే ఉంటాయి.