చాలా మంది బీర్‌తో తలస్నానం చేస్తుంటారు. బీఆర్ షాంపూలను కూడా వాడుతుంటారు. బీరుతో జుట్టును కడగడం ప్రయోజనకరం అని వైద్యపరంగా ఎలాంటి ఆధారాలు లేవు.
బీర్‌లోని ప్రొటీన్, బి విటమిన్లు జుట్టును మెరిసేలా చేస్తాయి, ఒత్తుగా మారుస్తాయని కొందరు భావిస్తుంటారు.
బీర్ వల్ల స్కాల్ప్, హెయిర్ డ్రై అవుతుందని కొందరు అంటున్నారు. అంతేకాకుండా చుండ్రు, పొడిబారిన జుట్టుకు కారణమవుతుందని చెబుతున్నారు.
బీర్‌ను ఒక గిన్నెలో పోసి కొన్ని గంటలు లేదా రాత్రి మొత్తం అందులో గ్యాస్ పోయేలా చేయాలి, ఆ తర్వాత ఆ బీర్‌తో జుట్టును కడిగితే ప్రయోజనాలు ఉంటాయి.
గడువు ముగిసిన బీర్‌తో జుట్టును కడగవద్దు. అంతేకాకుండా చల్లగా ఉన్న బీర్‌ను ఉపయోగించవద్దని చెబుతున్నారు. పూర్తిగా అందులోని గ్యాస్ పోయిన తర్వాతే వాడాలంటున్నారు.
షాంపూ, హెయిర్ మాస్క్ లేదా రిన్స్ రూపంలో బీర్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు.