Organs: మన శరీరంలో ఉండే రెండు కిడ్నీల పరిమాణం మన కళ్లు లేదా చెవుల మాదిరిగా ఒకేలా ఉండదు. మన ఎడమ మూత్రపిండము కుడి మూత్రపిండము కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. మానవ శరీరం అనేక మూలకాలతో రూపొందించబడింది. వాటిలో ఒకటి బంగారం. సగటున 70 కిలోల మనిషి శరీరంలో 0.2 mg వరకు బంగారం ఉంటుంది. అయితే ఈ బంగారాన్ని మానవ శరీరం నుంచి తొలగించలేము. స్త్రీల గుండె పురుషుల కంటే వేగంగా కొట్టుకుంటుంది. పురుషుల కంటే స్త్రీల శరీర పరిమాణం చిన్నది కాబట్టి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె తక్కువ కష్టపడాల్సి వస్తుంది.
ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే..
ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ సగటున 50-100 వెంట్రుకలు కోల్పోతాడు. ఇది పూర్తిగా సాధారణం, కానీ జుట్టు ఇంతకంటే ఎక్కువగా రాలితే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అని నిపుణులు అంటున్నారు. మన తుమ్ముల వేగం గంటకు 150 కిలోమీటర్లు ఉంటుంది, అందుకే తుమ్మును ఆపడం మెదడు లేదా చెవులను ప్రభావితం చేస్తుంది. మన చేతుల్లోని మధ్య వేలు గోళ్లు వేగంగా పెరుగుతాయి. అయితే మన పాదాల గోళ్లు చేతుల కంటే 4 రెట్లు నెమ్మదిగా పెరుగుతాయి. అంటే మన చేతుల గోళ్లు 10 రోజుల్లో 1 సెంటీమీటర్ పెరిగితే, మన పాదాల గోళ్లు 40 రోజుల్లో ఒక సెంటీమీటర్ పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: యమునా నదిలో నురుగు... స్నానం చేస్తే అంతే సంగతులా?
రోజంతా మన శరీరం పొడవు కొద్దిగా మారుతూ ఉంటుంది. ఉదయం మన ఎత్తు 1 సెంటీమీటర్ వరకు పొడవుగా మారితే సాయంత్రం ఒక సెంటీమీటర్ వరకు తగ్గుతుంది. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే కొంచెం ఎక్కువ రంగులను చూడగలరు. పురుషులు నిమిషానికి సగటున 11-12 సార్లు కనురెప్పలు వేస్తారు, అయితే మహిళలు నిమిషానికి 15-20 సార్లు కనురెప్పలు రెప్పవేసుకుంటారు. పుట్టినప్పుడు మానవ శరీరంలో దాదాపు 300 ఎముకలు ఉంటాయి. కానీ పెరిగేకొద్దీ ఈ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి, చివరికి 206 మాత్రమే అవుతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దీపావళి తేదీపై గందరగోళం..అసలు పండగ ఎప్పుడు?