Eyes Tips: ఈ ఆహారాలు తింటే.. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి

కంటి ప్రకాశాన్ని కాపాడుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్, పచ్చని ఆకుకూరలు, గుడ్డు, చిలగడదుంప, నారింజ వంటివి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే కంటి ఆరోగ్యం, దృష్టి నాణ్యతను మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
eyes2

Eyes Tips

Eyes: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనకు చాలా ముఖ్యం. ఈ టెక్నాలజీ యుగంలో పెరుగుతున్న మొబైల్స్, కంప్యూటర్ల వినియోగం కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  ఆ సమయంలో కంటి ప్రకాశాన్ని కాపాడుకునే ఆహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవడం అవసరం. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణలు అంటున్నారు. మరి ఆ ఆహారాలు ఏంటి.. ? వాటిని ఏలా తినాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్యారెట్:

క్యారెట్‌లను విటమిన్ ఎ ముఖ్యమైన వనరుగా పరిగణిస్తారు. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మార్చి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుపడి కంటి అలసట తగ్గుతుంది.

పచ్చని ఆకుకూరలు:

పచ్చని ఆకు కూరలలో బచ్చలికూర ముఖ్యంగా కళ్లకు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కంటి కండరాలను బలోపేతం చేస్తాయి. వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను నివారిస్తుంది.

గుడ్డు:

గుడ్లలో విటమిన్ ఎ, జింక్, లుటిన్ ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అవసరం. గుడ్డు పచ్చసొనలో అధికంగా ల్యూటిన్ ఉంటుంది. ఇది రెటీనాను హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది. దీని రెగ్యులర్ వినియోగం కంటికి రక్షణ కల్పిచిటంతోపాటు దృష్టి నాణ్యతను మెరుగుపడుతుంది.

చిలగడదుంప:

చిలగడదుంపలలో అధికంగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి కణాలను రక్షించి కళ్లను తేమగా ఉంచుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కంటి చూపు బలంగా మారుతుంది.

నారింజ:

నారింజలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంఉటంది. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కంటి కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఇది ఒకటి తిన్నారంటే మలబద్ధకం అస్సలు ఉండదు..పొట్ట కూడా మాయం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు