ముల్లంగి మన శరీరానికి గొప్ప పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేయడంతో పాటు ఎన్నో విటమిన్స్ మనకు అందేలా చేస్తుంది.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి మనకు అందించిన ఆహారం కూరగాయలు. అన్ని కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిలో అధికంగా పోషకాలు లభిస్తాయి.
ముల్లంగి ఒక భూగర్భ కూరగాయ. దీనిని రోజూ తినడం వల్ల జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రోజుకు ఒక ముల్లంగి తినడం ద్వారా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిని రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే ఇందులో ఉండే అధిక పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ముల్లంగి పిత్త నీటి ఉత్పత్తిని నియంత్రిస్తుంది. కాలేయం, పిత్తాశయాన్ని రక్షిస్తుంది. ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కాలేయం మలినాలను బయటకు పంపుతుంది. ముల్లంగిలో ఉండే ఎంజైమ్లు కాలేయంలో కొవ్వు నిల్వలను నివారిస్తాయి. కాబట్టి ముల్లంగిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయం డిటాక్సిఫై అవుతుంది.