Chavanprash: చలికాలం ప్రారంభం కానుంది. చలి నుంచి రక్షించుకోవడానికి చాలా మంది చవాన్‌ప్రాష్‌ని తీసుకుంటారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అనేక చవాన్‌ప్రాష్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అనేక ఆయుర్వేద చవాన్‌ప్రాష్‌లు కూడా దొరుకుతున్నాయి. పాలములో ఉండే ఆయుర్వేద నిపుణుడు..ఆయుర్వేద పద్ధతిలో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది రకాల చవాన్‌ప్రాష్‌లను తయారు చేశాడు. వీటిలో ఒకటి కేసర్ చవాన్‌ప్రాష్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఎందుకంటే దీనిని తయారు చేయడం చాలా కష్టం. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అయితే జార్ఖండ్‌లోని పాలములో తయారుచేసే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చవాన్ ప్రాష్ గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎలా తయారు చేస్తారు..?
దీన్ని ఎండుద్రాక్ష, లవంగాలు, కుంకుమపువ్వుతో తయారు చేస్తారు. దీనిని తయారు చేయడానికి రెండు నెలల సమయం పడుతుంది. 750 గ్రాముల కుంకుమపువ్వు, 150 గ్రాముల లవంగం సారం, 100 గ్రాముల ఎండుద్రాక్ష సారం ఉపయోగిస్తారు. రాత్రిపూట పాలతో కేసర్ చవాన్‌ప్రాష్ వాడాలని నిపుణులు అంటున్నారు. దీనిని ఉదయాన్నే నీటితో కూడా ఉపయోగించవచ్చని, అదే సమయంలో రాత్రి భోజనం తర్వాత నిద్రపోయే ముందు 2 గ్రాముల కుంకుమపువ్వు చవాన్‌ప్రాష్‌ను పాలతో కలిపి తీసుకుంటే అనేక వ్యాధులను నయం చేస్తుందని చెబుతున్నారు.
ఎంత గడ్డకట్టే చలిలోనైనా చెంచా ఈ చవాన్‌ప్రాష్ తిని బయటికి వెళ్తే స్వెట్టర్లు అక్కర్లేదని, హాయిగా చలిలో సైతం చక్కెర్లు కొట్టొచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ చవాన్ ప్రాష్ తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని, రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మూడేళ్ల లోపు పిల్లలు మాత్రం తినకూడదంటున్నారు. చవాన్‌ప్రాష్ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: షుగర్ ఉన్నవారు నవరాత్రి ఉపవాసం ఎలా చేయాలి?