Early Morning Foods: ఉదయాన్నే ఈ డేంజరస్ ఫుడ్స్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీ, స్వీట్లు, అధిక చక్కెర ఉండే పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల అసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Avoid Foods

Avoid Foods

ఉదయం లేచిన వెంటనే మనం తీసుకునే ఆహారం రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం అసలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట తినకూడని ఆ డేంజరస్ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

కాఫీ లేదా టీ

ఉదయం లేవగానే చాలా మందికి కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అల్సర్‌కు కూడా దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ముందుగా కాస్త నీరు తాగి ఏదైనా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాతే టీ, కాఫీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

స్వీట్లు, అధిక చక్కెర పదార్థాలు
దోసె, ఇడ్లీ పక్కన పెట్టుకునే చెక్కర, లేదా ఉదయం తినే డోనట్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత మళ్లీ వేగంగా పడిపోతాయి. దీని వల్ల రోజు మధ్యలో నిస్సత్తువగా, బలహీనంగా అనిపించవచ్చు. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

పుల్లని పండ్లు
నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పుల్లని పండ్లలో యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ లైనింగ్‌కు చికాకు కలిగి, కడుపు నొప్పి లేదా గుండెల్లో మంట రావచ్చు. వీటిని తినాలనుకుంటే ముందుగా కొన్ని నానబెట్టిన బాదం పప్పులు లేదా ఒక గ్లాసు నీళ్లు తాగి తీసుకోవడం మంచిది.

స్పైసీ, మసాలా ఆహారాలు
ఉదయాన్నే వేడి వేడిగా, కారంగా ఉండే వస్తువులు తీసుకుంటే కడుపులో సున్నితమైన గోడలు దెబ్బతిని, తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఎరిటేషన్ ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు