శంఖు పుష్పంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మనం ఎన్నో రకాల టీలు తాగి ఉంటాం. ఈ శంఖుపువ్వుతో చేసిన టీ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఆయుర్వేదంలో శంఖుపువ్వులను బాగా వాడుతారు. దీనికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. శంఖుపువ్వులతో టీ చేసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
ఈ టీ తాగడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. రోగనిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది. జీర్ణక్రియ సులభం అవుతుందని వైద్యులు అంటున్నారు. ఈ టీలోని నీలం రంగు ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
శంఖుపువ్వు టీ తాగడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మొక్కగా శంఖుమొక్కను పిలుస్తారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
శంఖు పుష్పాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. కణజాలాల పునరుద్ధరణకు సాయపడతాయి. మనల్ని ఎన్నో వ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. తొందరగా వృద్ధాప్యం రాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
శంఖుపుష్పాల టీ తరచూ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని ఫ్లావనాయిడ్లు, పోషకాలు ఇమ్యూనిటీని పెంచి జలుబు, దగ్గును దూరం చేస్తాయి.