ఈ 5 రకాల పువ్వులతో.. మధుమేహానికి చెక్ పెట్టండిలా!

మధుమేహంతో ఎక్కువగా బాధపడుతున్నవారు డాలియా, మడగాస్కర్ పెరివింకిల్, అరటి పువ్వు, మందార, సీతాకోకచిలుక బఠానీ పువ్వులతో చెక్ పెట్టవచ్చు. ఈ పువ్వులతో పానీయాలు చేసి తాగడం వల్ల టైప్2 డయాబెటిస్ కూడా నయం అవుతుంది.

New Update
diabetic

ఈరోజుల్లో ఎక్కువమంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహాన్ని తగ్గించుకోవాలంటే ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. ఆహార విషయంలో అసలు కంట్రోల్ ఉండకపోతే మధుమేహాన్ని తగ్గించడం సాధ్యం కాదు. అయితే డయాబెటిస్‌ నుంచి విముక్తి పొందాలంటే ఈ ఐదు రకాల పువ్వులు బాగా ఉపయోగపడతాయి. 

డాలియా

డాలియా పువ్వుల రేకుల్లోని అణువులతో ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంతో పాటు మెదడు వాపును కూడా తగ్గిస్తుంది. 

మడగాస్కర్ పెరివింకిల్

మడగాస్కర్ పెరివింకిల్ పువ్వులోని అణువుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మం, గొంతు ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

అరటి పువ్వు

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అరటి పువ్వు బాగా ఉపయోగపడుతుంది. అలాగే అరటి పువ్వుతో ఈజీగా బరువు కూడా తగ్గవచ్చు. దీంతో పాటు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది 

మందార పువ్వు

మందార పువ్వుల నుంచి తయారు చేసిన పానీయం తాగడం వల్ల మధుమేహం తగ్గుతుంది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ పెరుగుదలను మందార పువ్వు నిరోధిస్తుంది. 

సీతాకోకచిలుక బఠానీ పువ్వు

నీలంగా ఉండే సీతాకోకచిలుక బఠానీ పువ్వులో బోలెడన్నీ ఔషధాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులోని హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహం రాకుండా కాపాడుతుంది. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు