Diabetes: ఈ కాయలు తింటే మధుమేహం దరిచేరదు

సీమ చింతకాయలను గుబ్బ కాయలని అంటారు. ఈ కాయలు తినడం వల్ల డయాబెటిస్ తగ్గటంతోపాటు ఎన్నో రోగాలు అదుపులో ఉంటాయి. సీమచింతకాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

diabetes

Diabetes

New Update

Diabetes: సీమచింతకాయలు చూసేందుకు జిలేబీ ఆకారంలో ఉంటాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. డయాబెటిస్ నుంచి ఎన్నో రోగాలు ఈ కాయలు తినడం వల్ల అదుపులో ఉంటాయి. గ్రామాల్లో పెరిగిన వారికి ఇవి బాగా తెలిసినవే. సిటీల్లో ఇవి దొరకడం చాలా కష్టం. నిజానికి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీమ చింతకాయలను గుబ్బ కాయలు అని కూడా అంటారు. అలాగే జంగిల్ జిలేబి అని పిలుస్తుంటారు.  సీమచింతకాయలు వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

భోజనం తర్వాత మంచిది:

  • మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత తీపి ఆహారం తినాలనిపిస్తే సీమ చింతకాయలు తింటే ఎంతో మంచిది. ఇవి ఆరోగ్యానికి అమృతంతో సమానం.  ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: ఈ కూరగాయలు తింటే బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్లు ఖాయం

పోషకాలు ఇవే:

  • సీమ చింతకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. 

షుగర్‌ పేషెంట్లకు వరం:

  • సీమ చింతకాయలు డయాబెటిస్ రోగుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. వీటి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆకుల సారాన్ని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు  చెబుతున్నారు. సీమచింతకాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇలా చేశారంటే ముక్కు కారడం వెంటనే ఆగిపోతుంది

#diabetes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe