/rtv/media/media_files/2025/09/20/devi-navaratri-2025-09-20-11-40-20.jpg)
Devi Navaratri
హిందూ సంప్రదాయంలో దేవీ నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. స్త్రీ శక్తిని పూజిస్తూ ప్రతీ ఏడాది భక్తితో దుర్గాదేవిని కొలుస్తారు. వివిధ రూపాల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. అయితే హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ ఏడాది ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి రోజు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతీ రోజూ అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించి పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిగా పూజలు చేస్తారు. అయితే ఈ ఏడాది దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అవుతున్నాయి. మరి ఈ దేవీ నవరాత్రులు సమయంలో ముఖ్యంగా ఏ నియమాలు పాటిస్తే అన్ని విధాలుగా మంచి జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
లలితా సహస్ర నామం పఠించాలి
నవరాత్రుల సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేలలో తప్పకుండా లలితా సహస్ర నామం పఠించాలి. ఈ నామాన్ని పఠించడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అన్ని విధాలుగా సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. వేకువ జామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి ముందుగా పూజ చేయాలి. ఆ తర్వాత లలితా సహస్ర నామం పఠించాలని పండితులు చెబుతున్నారు.
దుర్గా సప్తశతి పారాయణం
నవరాత్రుల సమయంలో తప్పకుండా దుర్గా సప్తశతి పారాయణం చేయాలని పండితులు అంటున్నారు. ఈ పారాయణం చేయడం వల్ల దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే ఎలాంటి భయాలు లేకుండా ఉంటారు. చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అమ్మవారికి నైవేద్యం
దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం తప్పకుండా సమర్పించాలని పండితులు అంటున్నారు. దేవీ రూపాన్ని బట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టాలని పండితులు చెబుతున్నారు. వీటిని పెట్టడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అందుతాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో సంతోషాలు, ఐశ్వర్యం కూడా పెరుగుతాయని చెబుతున్నారు.
దీపారాధన
దేవీ నవరాత్రుల సమయంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో తప్పకుండా దేవుడి గదితో పాటు ఇంటి ద్వారం దగ్గర దీపం వెలిగించాలని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇళ్లు కూడా పాజిటివ్‌గా ఉంటుందని అంటున్నారు.
పసుపు, కుంకుమ
దేవీ నవరాత్రుల సమయంలో మహిళలను గౌరవించాలి. ముఖ్యంగా మహిళలు అయితే తప్పకుండా కొత్త దుస్తులు ధరించాలి. అలాగే పసుపు, కుంకుమ, పూలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు దుర్గాదేవికి అందుతాయని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల అమ్మవారిని గౌరవించినట్లు అవుతుందని చెబుతున్నారు.
అదృష్టం
తొమ్మిది రోజుల పాటు ఇలా చేయడం వల్ల జ్ఞానం, సంపద, ఐశ్వర్యం, సంతానం వంటివి లభిస్తాయని పండితులు అంటున్నారు. అలాగే దరిద్రమంతా తొలగిపోయి సంతోషం కలుగుతుందని చెబుతున్నారు. ఈ నవరాత్రుల్లో పూజలు నిర్వహించడం వల్ల పాపాలు అన్ని కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా జీవిస్తారని పండితులు అంటున్నారు. భక్తితో పూజలు నిర్వహిస్తే ఆటంకాలు అన్ని తొలగిపోయి.. ప్రతీ పనిలో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.