బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. సాధారణంగా చాలామంది చల్లని నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు వేడి నీటిని తాగుతారు. చల్లని నీరు కంటే వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని, రోజంతా యాక్టివ్‌గా కూడా ఉంటారని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పరగడుపున వేడినీరు తాగడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా జీర్ణ క్రియ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి గోరువెచ్చని నీరు మంచి చిట్కా. మలబద్దకంతో ఇబ్బంది పడేవారికి కూడా వేడినీరు బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వేడి నీరు తాగితే నొప్పి లేకుండా బాత్‌రూమ్ ఫ్రీ అవుతుంది.గోరువెచ్చని నీరు తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్, ఆందోళన, ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.