దసరా రోజు ఈ పుష్పంతో పూజిస్తే.. ఇళ్లంతా కాసుల వర్షం

దసరా పండుగ రోజు అపరాజిత పుష్పంతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలగడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పుష్పాన్ని ఇంటి ద్వారం దగ్గర పెడితే ఇంట్లో కాసుల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు.

FotoJet (23)
New Update

దేశవ్యాప్తంగా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున శ్రీరాముడు రావణుడిపై చేసిన యుద్ధంలో విజయం సాధించాడని విజయదశమి పండుగ జరుపుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా కూడా ఈరోజు సూచిస్తారు. చాలా ప్రదేశాల్లో ఈ రోజు రావణాసురుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు. అయితే దసరా రోజు కొన్ని నియమ నిబంధనలతో దుర్గాదేవిని పూజిస్తే కోరిక కోరికలు నెరవేరడంతో పాటు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇది కూడా చూడండి: Dasara: దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు

ఇలా పూజిస్తే..

ఈ రోజు దుర్గాదేవిని అపరాజిత పుష్పంతో పూజ చేస్తే మంచిదని, సకల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. తెలుపు, నీలం రంగుల్లో ఉండే వీటిని శంఖం పూలు అని కూడా అంటారు. పూజ చేసేటప్పుడు ఈ అపరాజిత పుష్పంతో చేయడం వల్ల ఇంట్లో కాసులు వర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు. దసరా రోజున అపరాజిత పుష్పంతో పూజ చేస్తే దుర్గాదేవీతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 

ఇది కూడా చూడండి: Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!

అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండటంతో పాటు ఎలాంటి బాధలు ఉన్న తీరిపోతాయట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు దుర్గాదేవీని అపరాజిత పుష్పాలతో పూజించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఈ పుష్పాన్ని ఇంటి ద్వారం దగ్గర ఓ పాత్రలో వేసి ఉంచిన కూడా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ పుష్పాలను నీటిలో వేసి స్నానం చేసిన మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

గమనిక: ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేయడం జరిగింది. దీనికి RTV ఎలాంటి బాధ్యత వహించదు. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సూచనలు తీసుకోవడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్‌డీ

#dasara #vijayadashami
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe