8 బతికున్న కప్పలు మింగిన మహిళ.. తర్వాత ఏం జరిగిందో తెలుస్తే షాక్!

తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల జాంగ్ అనే వృద్ధురాలు చాలా కాలంగా 'హెర్నియేటెడ్ డిస్క్' కారణంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఆమెకు నడుము నొప్పి తగ్గకపోగా, తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు.

New Update
Swallows Live Frogs

నడుము నొప్పిని తట్టుకోలేక నాటు వైద్య విధానాన్ని అనుసరించిన చైనా వృద్ధురాలి ఉదంతం కలకలం రేపింది. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు అయ్యింది ఆ ముసలావిడ పని. తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల జాంగ్ అనే వృద్ధురాలు చాలా కాలంగా 'హెర్నియేటెడ్ డిస్క్' కారణంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. బతికి ఉన్న కప్పలను మింగితే ఈ నొప్పి తగ్గుతుందనే ఓ నాటు వైద్య ప్రచారాన్ని ఆమె నమ్మింది. ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పకుండా, కొన్ని చిన్న కప్పలను పట్టుకురావాలని ఆ వృద్ధురాలు కోరింది.

కుటుంబ సభ్యులు కప్పలను తీసుకురాగా, ఆమె వాటిని వండకుండా లేదా శుభ్రం చేయకుండా బతికి ఉండగానే మింగేసింది. మొదట మూడు కప్పలను, ఆ మరుసటి రోజు ఐదు కప్పలను మింగింది. మొత్తం ఎనిమిది బతికిఉన్న కప్పలను మింగిన తరువాత, ఆమెకు నడుము నొప్పి తగ్గకపోగా, తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రమై నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో, ఆమె తన కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పింది.

వెంటనే వారు ఆమెను హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్సిటీ ఫస్ట్ అఫిలియేటెడ్ హాస్పిటల్‌లో చేర్చారు. వైద్యులు ఆమెను పరీక్షించి ఆశ్చర్యపోయారు. ఆమె కడుపులో కప్పలను గుర్తించారు. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా ఉండే స్పార్గానమ్ అనే టేప్‌వార్మ్ లార్వాలతో పాటు, ఇతర బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు నిర్ధారించారు. సజీవ కప్పలను మింగడంతో ఆమె జీర్ణవ్యవస్థ దెబ్బతిని, ఈ పరాన్నజీవులు శరీరంలో చేరినట్లు వైద్యులు తెలిపారు.

సుమారు రెండు వారాల పాటు చికిత్స పొందిన తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇలాంటి అశాస్త్రీయ నాటు వైద్య చిట్కాలను నమ్మవద్దని, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు హెచ్చరించారు. ఈ సంఘటన అశాస్త్రీయ వైద్య విధానాల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు