Pig liver: మనిషికి పంది లివర్‌ను అమర్చిన చైనా డాక్టర్లు

చైనా డాక్టర్లు వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని కనిపెట్టారు. పంది కాలేయాన్ని బ్రెయిన్ డెడ్‌ అయిన వ్యక్తికి అమర్చారు. చైనాలోని ఫోర్త్‌ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ చేశారు.

New Update
transplant pig liver into man

transplant pig liver into man Photograph: (transplant pig liver into man)

చైనా డాక్టర్లు వైద్యశాస్త్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించారు. తొలిసారిగా జన్యుపరంగా మార్పు చెందిన పంది కాలేయాన్ని బ్రెయిన్ డెడ్‌ అయిన వ్యక్తికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతమై.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో లివర్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. చైనాలోని ఫోర్త్‌ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన కై-షాన్ టావో, జావో-జు యాంగ్, జువాన్ జాంగ్, హాంగ్-టావో జాంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ చేశారు. జీన్-మోడిఫైడ్ పిగ్-టు-హ్యూమన్ లివర్ జెనోట్రాన్స్ప్లాంటేషన్  అనే శీర్షికతో ఈ అధ్యయనం 2025 మార్చి 26న నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో ఆరు జన్యువులు సవరించిన పంది నుంచి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి కాలేయాన్ని జెనోట్రాన్స్ప్లాంట్ చేశామని వైద్యులు ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. అయితే ఈ శస్త్రచికిత్స అధికారికంగా మార్చి 10న 2024న జరిగింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి కుటుంబ సభ్యుల అంగీకారంతో వైద్యులు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఆపరేషన్‌ పూర్తి అయిన తర్వాత.. ఓ పది రోజుల పాటు మనిషిలో ఆ లివర్‌ ఎలా పనిచేస్తోంది, రక్తం ప్రవాహం, పిత్త ఉత్పత్తి, రోగనిరోధక ప్రతిస్పందన, ఇతర కీలక విధులను పర్యవేక్షించారు.

Also read: Char Dham Yatra: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

ప్రపంచవ్యాప్తంగా అవయవ కొరత సంక్షోభాన్ని పరిష్కరించడానికి చైనా వైద్యులు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని సార్లు మనిషి శరీరం ఇలాంటి ఇతర జీవాల అవయవాలను తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం పంది లివర్‌ అద్భుతంగా పనిచేస్తోందని, పది రోజులు పర్యవేక్షణ తర్వాత వైద్యులు ధృవీకరించారు. అలాగే కీలకమైన ప్రోటీన్ అల్బుమిన్‌ను ఉత్పత్తి చేసిందని జియాన్ వైద్యులు తెలిపారు. ఈ ప్రయోగం ఎన్నో ఆశలు రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది భారీ ఊరటను ఇచ్చే అంశమని వైద్యులు అంటున్నారు. లివర్‌ మార్పిడి ఆపరేషన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదురుచూస్తున్నారని, కానీ, వారికి దాతలు దొరకడం లేదని, ఒక వేళ ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్‌ అయితే.. భవిష్యత్తులో జన్యుపరంగా కొన్ని మార్పులు చేసిన పంది లివర్‌ను మనుషులకు అమర్చే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

Also read: OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు