చైనా అంటే సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు. చైనీయుల సాంకేతిక నైపుణ్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా 'అరచేతి స్కానింగ్'తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. ఈ పద్ధతికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెర వైరల్‌గా మారింది.
Also Read: బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లలో కొంతమంది ఈ సాంకేతికతపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే కొందరు మాత్రం అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నారు. తమ దేశాలలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బావుంటుందని ఇంకొందరు కామెంట్ చేశారు.