Health Tips: భారతదేశంలో ఎక్కువ శాతం మంది మాంసాహారం తినేందుకు ఇష్టపడుతుంటారు. ఆదివారం వచ్చిందంటే మాంసాహార షాపుల దగ్గర క్యూలు కనిపిస్తూ ఉంటాయి. అయితే.. మటన్ తినేవారికి వైద్యులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. కిలో మటన్‌లో 243 మిల్లీగ్ల యాంటీబయోటిక్స్ ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. అలాగే పంది మాంసంలో 173 మిల్లీగ్రాములు ఆవు మాంసంలో 60 మిల్లీ గ్రాములు, కోడి మాంసంలో 35 మిల్లీ గ్రాములు యాంటీబయటిక్ ఆనవాళ్లను కనుగొన్నారు. ఇలా యాంటీబయటిక్స్ ఉన్న మాంసాహారం తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బెంగాల్లోని విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలో మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయోటిక్స్ ఉన్నట్లు గుర్తించారు. జంతువులకు యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల వాటి మాంసాన్ని తినే మానవులకు కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని గుర్తించారు. 14 రోజుల తర్వాత వరకు ఈ మాంసాన్ని తినకూడదని చెబుతున్నారు. చికెన్‌లో సిప్రోఫ్లాక్సాసిన్, ఎన్రోఫ్లాక్సాసిన్, డాక్సీసైక్లిన్, స్టెప్టోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ అవశేషాలను చూశామని పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు వ్యాధులు: భారత్‌లో పాడి రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో పశువులకు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారని వైద్యులు అంటున్నారు. ఒక కోడి పిల్ల 40 రోజులకే తిరిగి మార్కెట్ కి వస్తుంది. ఇలా రావడానికి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సి వస్తుందని కోళ్ల ఫారం యజమానులు కూడా అంటున్నారు. దీంతో లాభాలు త్వరగా వస్తున్నాయని చెబుతున్నారు. ఇలా యాంటీబయటిక్స్ ఇవ్వడం వల్ల కోడి తర్వగా లావు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఎలాంటి వ్యాధులు కూడా కోడి దరిచేరవని చెబుతున్నారు. పశువులకు కూడా ఎలాంటి జబ్బులు రావని రైతులు అంటున్నారు. నిజానికి పశువులపాకులను శుభ్రంగా ఉండేలా చూసి మంచి వెంటిలేషన్స్ ఏర్పాటు చేస్తే వ్యాధులు రావని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇలా యాంటీబయోటిక్స్ వేయడం వల్ల అవి తిన్న మనుషులకు వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు.ఆక్సిటోసిన్ వల్ల అనేక వ్యాధులు: ఓ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాంటీబయాటిక్స్‌లో దాదాపు 70 శాతానికిపైగా పశువుల కోసమే వాడుతున్నారు. పాల ఉత్పత్తులను పెంచుకునేందుకు కూడా ఆక్సిటోసిన్ వంటివి ఆవులకు ఇస్తుంటారు. ఇవి తాగే పిల్లలు 10 సంవత్సరాల లోపే రజస్వల అవుతుంటారు. అంతేకాకుండా కోళ్లు, గొర్రెలకు కూడా ఆక్సిటోసిన్ ఇవ్వడం వల్ల ప్రజల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మాంసంలో యాంటీబయోటిక్స్ వల్ల వాటిని తిన్న మానవులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. జీర్ణక్రియ సమస్యలు పలు రకాల క్యాన్సర్లు నరాలకు సంబంధించిన వ్యాధులతోపాటు చర్మవ్యాధులు వస్తాయి. అంతేకాకుండా గర్భంలో పిండంపై కూడా ప్రభావం పడుతుందని.. పిల్లల్లో దంతాలపై మరకలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: వీర్యకణాలు ఎంతకాలం సజీవంగా ఉంటాయి?