Throat Cancer: గొంతు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. జగ్రత్త!

తరచుగా గొంతులో నొప్పి , ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది, వాయిస్ మారుతుండడం గొంతు క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లని సంప్రదించాలి.

Throat Cancer

Throat Cancer

New Update

Cancer: దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. అన్నవాహిక నుంచి చేతులు లేదా పెదవుల వరకు అన్నింటిలో క్యాన్సర్ సంభవించవచ్చు. రోగులకు నయం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండే వ్యాధి క్యాన్సర్.  ఎందుకంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి చివరి దశకి వచ్చినప్పుడే బయటపడుతుంది.  అన్న వాహిక క్యాన్సర్‌ వస్తే ఏం చేయాలో  కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అన్న వాహిక క్యాన్సర్‌:

  • క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.  తరచుగా గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి చాలా కాలం నుండి ఆహారం మింగడానికి ఇబ్బంది పడుతుంటే.. అతను గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అర్థం.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

  • గొంతు చుట్టూ కణాలు బాగా పెరిగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ కణాలు ఆహారనాళం నుంచి కడుపు వరకు వ్యాపించవచ్చు.
    ప్రేగుల్లో క్యాన్సర్ సంభవిస్తే నాళాలు క్రమంగా బ్లాక్ అవుతాయి. ప్రారంభ లక్షణాలు గొంతులో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది. కానీ కొంతమంది ఈ లక్షణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.  

ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ..?

  • అధిక యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడేవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ఎక్కువగా వేడినీరు లేదా లిక్విడ్ తాగే వారికి కూడా గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. తరచుగా గొంతులో నొప్పి ఉంటే, ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది లేదా వాయిస్ మారుతున్నట్లయితే ఈ లక్షణాలను పూర్తిగా విస్మరించవద్దు. ఎందుకంటే ఆలస్యం చేస్తే ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది.  అంతేకాకుండా పొగాకు తీసుకుంటున్నారా లేదా ధూమపానం చేస్తున్నారా లేదా అనేది కూడా ముఖ్యమని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌కు AIతో చికిత్స.. ఎలాగంటే?

#cancer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe