రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి చెందుతుంది. AI ద్వారా అనేక పరిష్కారాలు కనుగొంటున్నారు. భవిష్యత్ అంతా ఏఐదే అంటున్నారు. అలాగే క్యాన్సర్ రాకముందే భవిష్యత్తులో రావచ్చో లేదో ఏఐ చెప్పేస్తుంది.
ఆన్లైన్ షాపింగ్ దగ్గరి నుంచి సోషల్ మీడియా, ఆఫీసు పనుల్లో ఏఐ కీలకంగా మారింది. అయితే AI-ఆధారిత చాట్బాట్లు క్యాన్సర్, దాని చికిత్స గురించి సమాచారం ఇస్తున్నాయి.
బోస్టన్లోని మాస్ జనరల్ బ్రిగమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇందులో AI చాట్బాట్లు వైద్య సమాచారాన్ని సింథసైజ్ చేయగలవని శాస్త్రవేత్తలు అన్నారు. రోగుల నుండి క్లినికల్ ప్రశ్నలకు మాత్రం కొన్ని సమాధానం చెప్పలేకపోయాయి.
చాట్ జీపీటీ వెర్షన్ 3.5 వివిధ రకాల క్యాన్సర్లకు ప్రాథమిక చికిత్సలను అందించగలదని కనుగొన్నారు. ఒక వ్యక్తి శరీరంలో క్యాన్సర్ మొదటి దశలో ఉంటే దానిని ఏఐ ద్వారా సులభంగా గుర్తించవచ్చని అంటున్నారు.
రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందు AI ఎలా గుర్తించగలదో ఒక పరిశోధనలో తేలింది. ఆనంద్ మహీంద్రా X పోస్ట్‌లో దీని గురించి రాశారు. అంతేకాకుండా ఖచ్చితమైనదని నిరూపిస్తే అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ AI మోడల్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ఐదు సంవత్సరాల ముందే హెచ్చరిస్తుందని అంటున్నారు.