X-ray: జననేంద్రియాలను ఎముకగా మార్చే వ్యాధి

జననేంద్రియ ప్రాంతం మృదు కణజాలంలో వైద్యులు తీవ్రమైన కాల్సిఫికేషన్‌ను కనుగొన్నారు. దీన్ని ఎక్స్‌ట్రాస్కెలెటల్ బోన్ అంటారు. X-ray పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించారు. ఈ వ్యాధిలో జననేంద్రియ ప్రాంతంలో కాల్షియం లవణాలు ఫలకంలా పేరుకుపోతాయట.

New Update
Bone X-ray

Bone X-ray

X-ray: మోకాళ్ల నొప్పులకు చికిత్స కోసం వచ్చిన 63 ఏళ్ల వృద్ధుడి తుంటి భాగం ఎక్స్ రేను పరిశీలించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. జననేంద్రియాలను ఎముకలుగా మారే అరుదైన పరిస్థితి ఎక్స్-రేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని 'పెనైల్ ఆసిఫికేషన్' అంటారు. 2019లో 63 ఏళ్ల వ్యక్తి మోకాలిలో అసౌకర్యాన్ని అనుభవించిన తర్వాత న్యూయార్క్ నగర ఆస్పత్రికి చేరుకున్నాడు.  వైద్యులు మోకాలి నొప్పికి కారణం తెలుసుకునేందుకు ఎక్స్-రే తీసుకోవాలని సూచించారు. X-ray పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించారు.  జననేంద్రియ ప్రాంతం మృదు కణజాలంలో వైద్యులు తీవ్రమైన కాల్సిఫికేషన్‌ను కనుగొన్నారు. దీన్ని ఎక్స్‌ట్రాస్కెలెటల్ బోన్ అంటారు. 

లైంగిక సమస్యలు ఉన్న..

ఈ వ్యాధిలో జననేంద్రియ ప్రాంతంలో కాల్షియం లవణాలు ఫలకంలా పేరుకుపోతాయి. రాలజీ కేసు నివేదిక ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకు 40 కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యాయంటున్నారు. పెనైల్ ఆసిఫికేషన్ అనేది జననేంద్రియాల పాథోఫిజియాలజీ వల్ల కలిగే వ్యాధి, దీనిలో ఎముక లాంటి కణజాలం ఏర్పడుతుంది. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం.. తరచుగా లైంగిక సమస్యలు ఉన్న పురుషులలో కనిపించే పరిస్థితి అంటున్నారు. గాయం, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి వంటి అనేక ఇతర వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతున్నారు. పెరోనీస్ వ్యాధి పురుషాంగం ఉపరితలంపై రాయిగా లేదా పురుషాంగం వక్రంగా కనిపిస్తుంది. పురుషాంగం ఆకృతిలో వ్యత్యాసం, లైంగిక నపుంసకత్వము ఏర్పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వెన్నలాంటి మనసున్న వెన్నముద్దల బతుకమ్మ

Advertisment
తాజా కథనాలు