Buttermilk: చాలామంది ఎదుర్కొనే అనారోగ్యకర సమస్యల్లో మలబద్ధకం ఒకటి. మలం విసర్జించేటప్పుడు చాలామంది తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మలబద్ధకం సమస్య ఉంటే ఫ్రీ మోషన్ రాదు. మలం విసర్జించే సమయంలో తీవ్ర నొప్పికి గురవుతారు.
పొట్ట సమస్యలకు రిలీఫ్:
మలబద్ధకంతో బాధపడేవారికి మజ్జిగ సూపర్ ఫుడ్ అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మజ్జిగతోపాటు పీచు పదార్థాలు, ఆకుకూరలు తీసుకుంటే మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఆయుర్వేద ఔషధ గుణాలు ఆకుకూరల్లో ఎక్కువగా ఉండడంతో పొట్ట సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చునని వారు సూచిస్తున్నారు. మజ్జిగ తీసుకోని వారు జీలకర్ర, రాక్‌సాల్ట్ డ్రింక్‌గా తయారు చేసుకొని తాగితే.. రిలీఫ్ లభిస్తోందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉల్లిపాయలు, క్యారెట్, ద్రాక్షరసం తీసుకున్నా మలబద్ధకం నుంచి బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి: గుర్రం కంటే పాము వేగంగా వెళ్లగలదా..?