Bhut Jolokia Chilli: భారత్‌లో కొందరు మాత్రమే తినే మిరపకాయ భూట్ జోలోకియా అనేది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపగా పిలుస్తారు. దీని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ఈ మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. ఇది తిన్నాక కళ్ల నుంచి వెంటనే నీళ్లు కూడా వస్తాయి. By Vijaya Nimma 04 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 భారతదేశంలో అనేక రకాల మిరపకాయలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. అందరూ వాటిని తినడానికి ధైర్యం చేయలేరు. కొందరు స్పైసీ తినడానికి ఇష్టపడతారు. మరికొందరు తక్కువ మంటగా ఉన్న మిర్చిని తీసుకుంటారు. 2/6 భూట్ జోలోకియా అనేది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపగా పిలుస్తారు. దీని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ఈ మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. ఇది తిన్నాక కళ్ల నుంచి వెంటనే నీళ్లు కూడా వస్తాయి. 3/6 భూట్ జోలోకియా ప్రధానంగా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్ వంటి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో సాగు చేస్తారు. ఈ మిరపకాయను రాజా మిర్చి, నాగా మిర్చి, క్యాప్సికమ్ చినెన్స్, ఘోస్ట్ పెప్పర్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. 4/6 భూట్ జోలోకియా రుచిలో మాత్రమే కాదు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు చాలా మంచిది. బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. 5/6 దీనిని చట్నీ, పచ్చళ్లు, మసాలా తయారీలో వాడుతారు. కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే దీని మంటను భరించలేం. 6/6 భూట్ జోలోకియాలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉండటంతో చాలా కారంగా ఉంటుంది. క్యాప్సైసిన్ అనేది మిరపకాయలకు మసాలా రుచిని అందించే రసాయన సమ్మేళనం. #green-chillies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి