Beetroot and amla juice: ఉసిరి, బీట్‌రూట్‌లో జ్యూస్ పోషకాల శక్తి కేంద్రాలు. వీటి జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి. ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ముఖానికి కాంతిని తెస్తుంది. రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నిజానికి బీట్‌రూట్, ఉసిరి రెండింటిలోనూ అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్‌లో విటమిన్ బి9, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. బీట్‌రూట్, ఉసిరి జ్యూస్‌తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
చర్మం యవ్వనంగా:
- బీట్‌రూట్, ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. బీట్‌రూట్‌లో బీటలైన్స్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది ముఖంపై వాపును తగ్గిస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. అంతే కాకుండా విటమిన్ సి హైపర్పిగ్మెంటేషన్‌ను తగ్గించడం ద్వారా దెబ్బతిన్న చర్మాన్ని రక్షిస్తుంది. ముఖానికి గ్లో తీసుకొస్తుంది.
రోగనిరోధకశక్తి:
- శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధులు దూరమవుతాయి. జలుబు, దగ్గు నివారించడానికి బీట్‌రూట్, ఉసిరి కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు ఖాళీ కడుపుతో తాగాలి. వీటిలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. సీజనల్ వ్యాధుల నుండి కాపాడుతుంది.
రక్తపోటు తగ్గుతుంది:
- ఉసిరి, బీట్‌రూట్ రెండింటిలో రక్తపోటును నియంత్రించే గుణాలు ఉన్నాయి. వీటి రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరం శక్తిని కూడా పెంచుతుంది. బలహీనతతో పాటు అలసటను తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు.
జీర్ణక్రియ:
- అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే బీట్‌రూట్ జ్యూస్ మిమ్మల్ని రక్షిస్తుంది. ఉసిరితో కలిపి తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జీర్ణ శక్తిని బలపరుస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: క్యాన్సర్ వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి