Bathukamma: వెన్నలాంటి మనసున్న వెన్నముద్దల బతుకమ్మ

బతుకమ్మ ఉత్సవాల్లో ఎనిమిదవ రోజును వెన్నముద్దల బతుకమ్మగా పిలుచుకుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. బెల్లం, వెన్న, నెయ్యితో పాటు నువ్వులతో తయారు చేసిన వంటకాన్ని అమ్మ ముందు పెడతారు. అందుకే ఈ రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటున్నారు.

bathukamma..9

Bathukamma

New Update

Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో పట్టణాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పిల్లా పెద్దా అంతా ఉత్సాహంగా అమ్మను కొలుచుకుంటున్నారు. తీరొక్క పూలతో ఒక్కో రోజు ఒక్కో విధంగా బతుకమ్మను జరుపుకుంటున్నారు. రోజుకో నైవేద్యం సమర్పిస్తూ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఆరోరోజు అలిగిన బతుకమ్మ మినహాయిస్తే మిగతా రోజులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను మహిళలు పూజిస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో ఎనిమిదవ రోజుకు చాలా ప్రాధాన్యత ఉందంటున్నారు. ఈ రోజును వెన్నముద్దల బతుకమ్మగా పిలుచుకుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. బెల్లం, వెన్న, నెయ్యితో పాటు నువ్వులతో తయారు చేసిన వంటకాన్ని అమ్మ ముందు పెడతారు. అందుకే ఈ రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటున్నారు.

నెయ్యి,వెన్నతో దేవికి ప్రసాదాలు:

నువ్వులు, బెల్లం, నెయ్యి కలిపి తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. సాధారణంగా నూనెతో చేసే వంటకం కంటే నెయ్యి లేదా వెన్నతో వండితే చాలా రుచిగా ఉంటుంది. తీపి పదార్థానికి నెయ్యి తోడైతే ఆ రుచి వర్ణణాతీతం. ఈ నవరాత్రుల్లో దేవికి పెట్టే ప్రసాదాల్లో నెయ్యి లేదా వెన్న ఉండాల్సిందే. ఇవి రుచితో పాటు ఇందులో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నెయ్యిలో మంచి కొవ్వు ఉంటే.. వెన్నలో కేలరీలు తక్కువ అందుకే ఈరోజు వెన్నముద్దల బతుకమ్మలో ప్రధానంగా వెన్ననే వాడుతారు. 8వ రోజు బతుకమ్మను 8 అంతరాలు అంటే 8 అంతస్తులుగా పేరుస్తారు. గునుగు, చామంతి, గులాబీ, తంగేడు పూలతో పాటు గడ్డి పువ్వును కలిపి బతుకమ్మ తయారు చేస్తారు. మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మలు ఆడి ఆ తర్వాత నదులు, చెరువుల్లో గంగమ్మ చెంతకు బతుకమ్మలను చేరుస్తారు. ఇంటికి వచ్చాక ముత్తయిదువలకు వాయినాలు ఇచ్చి ఆరోజు వేడుకను ముగిస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: నవరాత్రి సమయంలో చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..?

#Bathukamma 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe